
హైదరాబాద్: బిజెపి జాతీయ సమావేశాల(bjp national meetings) సందర్భంగా ప్రధాన మంత్రినరేంద్ర మోదీ(modi) హైదరాబాద్ వచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(revant reddy) కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.తెలంగాణ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.లేదంటే మోదీ పర్యటనలో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా యువతన నిరసన తెలపాలని అన్నారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ను(agnipath) వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి