జవాన్‌‌లను అవమానించేలా మోదీ సర్కార్ వ్యవహారం: Revanth reddy

Published: Mon, 27 Jun 2022 14:12:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జవాన్‌‌లను అవమానించేలా మోదీ సర్కార్ వ్యవహారం: Revanth reddy

హైదరాబాద్: శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమనించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్గాజ్‌గిరి కూడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులను, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని  కాంగ్రెస్ గుర్తించిందన్నారు. అంబాని, ఆదాని కంపెనీల రక్షణకు అగ్నిపథ్ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. నాలుగేళ్లు సైన్యంలో ఆ తరువాత జీవిత కాలం బడా పారిశ్రామిక వేత్తలకు కాపలా కాయలా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదని, మాజీ సైనికుల హోదా లేదని, ఫించన్ కూడా లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.