TPCC Chief: మామ అల్లుళ్ళు మహిళా హంతకులు.. కేసీఆర్‌, హరీష్‌పై రేవంత్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-08-31T17:46:00+05:30 IST

ఇబ్రహీంపట్నం ఘటనను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకొని పనిచేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

TPCC Chief: మామ అల్లుళ్ళు మహిళా హంతకులు.. కేసీఆర్‌, హరీష్‌పై రేవంత్ ఆగ్రహం

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఘటనను కాంగ్రెస్ (Congress) సీరియస్‌గా తీసుకొని పనిచేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... ఆ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేయాలని పార్టీ నేతలను రేవంత్ (TPCC Chief) ఆదేశించారు. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు (Harish rao)ను కేబినెట్ నుంచి  బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మామ అల్లుళ్ళు మహిళా హంతకులు అంటూ కేసీఆర్ (KCR), హరీష్‌రావు (Telangana minister)ను ఉద్దేశిస్తూ టీపీసీసీ చీఫ్ (congress leader) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చనిపోయిన మహిళా కుటుంబాలను హరీష్‌రావు (TRS)  పరామర్శించాలన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తూతూ మంత్రంగా అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్దని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నేషనల్ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-08-31T17:46:00+05:30 IST