టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలైయ్యాయి: రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-01-05T01:22:33+05:30 IST
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలైయ్యాయంటూ
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలైయ్యాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. అందులో పార్ట్ 1 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడమన్నారు. అలాగే పార్ట్-2 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కస్టడీలోకి తీసుకోవడమని ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని చూపించుకోవడానికేనా ఇదంతా అని ఆయన ఆరోపించారు. ఇప్పుడు దీన్ని బహిర్గతం చేశామన్నారు. ఇప్పుడు డ్రామా ఎలా జరుగుతుందో చూద్దామని ట్విటర్లో ఆయన పేర్కొన్నారు.