హైదరాబాద్: TPCC కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నేడు

Published: Mon, 16 May 2022 11:01:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైదరాబాద్: TPCC కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నేడు

HYD: టీపీసీసీ (TPCC) కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్‌ (Gandhi Bhavan‌)లో జరగనుంది. ఈ భేటీకి సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య అనుబంధ సంఘాల ఛైర్మన్‌లను ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు డిక్లరేషన్‌తో జనంలోకి వెళ్ళే కార్యాచరణపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అలాగే పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ నేతలు పల్లెబాట పట్టనున్నారు. 300 మంది నాయకులతో డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లనున్నారు. ఒక్కో నాయకుడికి 30-40 గ్రామాల బాధ్యత అప్పగించే ఆలోచనలో టీకాంగ్రెస్ (T.Congress) ఉన్నట్లు తెలియవచ్చింది.


కాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ పెళ్లి విందులో డాన్స్ చేసి అలరించారు. ఆదివారం రాత్రి సంగారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్‌లో జరిగిన రిసెప్షన్‌కు ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, బంధువులతో కలిసి స్టెప్స్ వేశారు. జగ్గారెడ్డి డాన్స్ చూసి పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.