రైతుకంట కన్నీరా?

ABN , First Publish Date - 2020-10-30T11:42:31+05:30 IST

చెమటోడ్చి అన్నంపెట్టే అన్నదాతకు బేడీలు వేసిన వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

రైతుకంట కన్నీరా?

రాష్ట్రానికి మంచిది కాదంటూ

 టీడీపీ నాయకుల నిరసన


తిరుపతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):చెమటోడ్చి అన్నంపెట్టే అన్నదాతకు బేడీలు వేసిన వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి కోసం భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయించి సంకెళ్లు వేస్తారా అంటూ గురువారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట తెలుగుదేశం నిరసన చేపట్టింది. రైతు కంట కన్నీరు పెట్టించడం రాష్ట్రానికి మంచిదికాదని హెచ్చరించింది.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్‌ నాయకులు నరసింహ యాదవ్‌, బీఎల్‌ సంజయ్‌ తదితరులు మాట్లాడుతూ  అతివృష్టితో రైతులు నష్టపోతే సీఎం జగన్‌ తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుని వీడియో గేమ్‌లు అడుతున్నారని ఎద్దేవా చేశారు.


తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అమరావతి జేఏసీ, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టి తీరుతామన్నారు. ప్రజా రాజధాని అమరావతి కొనసాగుతుందని జగన్‌ చెప్పేవరకు తమ పోరాటం ఆగబోదన్నారు. అనంతరం ఆర్డీవో కనకనరసా రెడ్డికి వినతిపత్రం అందజేశారు.తెలుగుదేశం నాయకులు ఆర్సీ మునికృష్ణ, మస్తాన్‌ నాయుడు, బుల్లెట్‌ రమణ, విజయలక్ష్మి, పుష్పావతి, బ్యాంకు శాంతమ్మ, చినబాబు, మక్కీ యాదవ్‌, రవి నాయుడు, ఆనంద్‌ గౌడ్‌, రుద్రకోటి సదాశివం, మునిశేఖర్‌ రాయల్‌, సింధూజ, గంగులయ్య, రాజయ్య, మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T11:42:31+05:30 IST