ట్రాక్టర్‌ను ఢీకొని మోటార్‌ బైక్‌

Jun 22 2021 @ 01:27AM
మృతి చెందిన సాధిక్‌(30)


 ఒకరి మృతి

ఒంగోలు(క్రైం), జూన్‌ 21: ద్విచక్రవాహన చోదకుడు ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం పెళ్లూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట ఒకటో లైన్‌లో నివాసం ఉండే షేక్‌ సాధిక్‌(30) మృతి చెందాడు. సాధిక్‌ తన భార్యా,కుమార్తెను మోటార్‌ బైక్‌పై ఎక్కించుకొని అత్తగారు ఊరు అయిన కందుకూరు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో  బైక్‌ అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ  ప్రమాదంలో సాధిక్‌ తలకు త్రీవ గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్యా కుమార్తెలకు స్వల్పగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.