కదం తొక్కిన కార్మిక సంఘాలు

ABN , First Publish Date - 2020-11-27T04:33:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల ను నిరసిస్తూ గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భా గంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కార్మిక సంఘాలు ర్యాలీలు, ధర్నా నిర్వహించాయి.

కదం తొక్కిన కార్మిక సంఘాలు
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు

దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల మద్దతు
భోజన విరామ సమయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహార్యాలీ

నిజామాబాద్‌ అర్బన్‌/కామారెడ్డిటౌన్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల ను నిరసిస్తూ గురువారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భా గంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కార్మిక సంఘాలు ర్యాలీలు, ధర్నా నిర్వహించాయి. నిజామాబాద్‌ జిల్లా కేం ద్రంలో జిల్లా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహా  ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని గాంధీగంజ్‌ నుంచి గా ంధీచౌక్‌, బస్టాండ్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వ హించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రమ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్ర జాస్వామ్య, రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తూ.. చట్టాలను సవరిస్తూ కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ ప్రభుత్వం అపకపోతే రాబో యే రోజుల్లో పతనం తప్పదని, సమ్మె ద్వారానైనా ప్రభుత్వ ం కళ్లు తెరవాలన్నారు. కార్మికులు నిజమైన దేశభక్తుల వలే ప్రభుత్వ రంగసంస్థలను కాపాడాలని చూస్తుంటే ప్రభుత్వ మే ద్వేషద్రోహి అవతారమెత్తి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మజూపుతోందని ఆమె విమర్శించారు. అనం తరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌, ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు నరేందర్‌, భూమ య్య తదితరులు మాట్లాడారు. ధర్నా అనంతరం కలెక్టర్‌  నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో బీఎల్‌టీఎఫ్‌ నాయకుడు మల్లికార్జున్‌, టీడీపీ నాయకు లు సురేష్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు విపుల్‌గౌడ్‌, ఐఎఫ్‌ టీయూ నాయకుడు భాస్కర్‌, ఈవీఎల్‌ నారాయణ, అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. అదే విధంగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఏఐసీటీయూ, బీ ఎల్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, బీకేఎస్‌, ఐఎఫ్‌టీయూ-కె ఆధ్వ ర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
ప్రగతి భవన్‌ ఎదుట ఉద్యోగ జేఏసీ నిరసన
అఖిల భారత ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు దేశవ్యా ప్త సమ్మెలో భాగంగా గురువారం జిల్లా ఉద్యోగ జేఏసీ  ఆ ధ్వర్యంలో కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టి సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ అలుక కిషన్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్ర భుత్వం పరిష్కరించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీల ను భర్తీచేయాలన్నారు. ఆదాయ పన్ను సీలింగ్‌ 10 లక్షలకు పెంచాలని ఔట్‌సోర్సింగ్‌, కాంటాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా కార్యద ర్శి అమృత్‌కుమార్‌, నాయకులు గంగాకిషన్‌, గోవర్ధన్‌, బీ ఎల్‌ శంకర్‌, వేణు, నాగరాజు, పోల శ్రీనివాస్‌, శేఖర్‌, సత్యం, రమణ్‌రెడ్డి, సతీష్‌, ఆకుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల ను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం కా మారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద వద్ద ఏఐఎస్‌జీఈ ఎఫ్‌తో పాటు సీపీఐ, సీపీఎం అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, ఆర్డీవో కార్యాలయం వద్ద ఏఐసీటీయూ, బీఎల్‌ టీయూ, ఏఐఎఫ్‌టీయూ, బీకేఎస్‌, ఐఎప్‌టీయూ,  ఆధ్వర్యం లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ నా న్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దయా నంద్‌ మాట్లాడుతూ.. పీఆర్‌సీని వెంటనే అమలుచేయాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాల ని తదితర అంశాలపై మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలో కి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను పెట్టుబడిదారులు, కా ర్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టిందని అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలు, కార్మికు లు పోరాడి సాధించుకుని హక్కులను పూర్తిగా రద్దుచేసి.. 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులు 8 గంటల ప నిని 12, 13 గంటలు చేయాలని చూడడం దారుణమన్నా రు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్‌ ప్రధానకార్యదర్శి వెంకట్‌రె డ్డి, కోశాధికారి నాగరాజు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సయ్యద్‌బా బా, సునీల్‌కుమార్‌, కిషన్‌, కార్మిక, ప్రజాసంఘాల నాయకు లు సదానందం, జబ్బర్‌నాయక్‌, రవి, లక్ష్మీ, కమురిద్దిన్‌, నీల, దుర్గయ్య, సీపీఐ, సీపీఎం నాయకులు దశరఽథ్‌, వీఎల్‌ నర్సిం హారెడ్డి, ఎల్లన్న, చంద్రశేఖర్‌, సంతోష్‌, పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:33:38+05:30 IST