తిరుపతిలో లాక్‌డౌన్ ఆంక్షలపై వ్యాపారుల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-14T17:34:06+05:30 IST

కొత్త లాక్ డౌన్ విధానంపై తిరుపతిలోని వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో లాక్‌డౌన్ ఆంక్షలపై వ్యాపారుల ఆగ్రహం

తిరుపతి: కొత్త లాక్ డౌన్ విధానంపై తిరుపతిలోని వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తలాతోకలేని విధానాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త లాక్ డౌన్ విధానం ప్రకారం తిరుపతిలో 20 పాజిటీవ్ కేసులు ఉన్న డివిజన్‌లలో సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రాంతాలు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంటుంది. 


తిరుపతిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తిరుపతిలో మొత్తం 50 డివిజన్లు ఉంటే అందులో 10 డివిజన్లలో 20కి పైగా కేసులు నమోదు కావడంతో ఆ 10 డివిజన్లు పూర్తిగా లాక్ డౌన్ చేశారు. ఒక వీధిలో షాపులు తెరిచి, మరో వీధిలో షాపులు మూసివేస్తే బాథకలుగుతుందన్నారు. వాళ్లు వ్యాపారం చేసుకుంటే.. మేము షాపులు మూసుకుని కూర్చుంటున్నామన్నారు. ఇలాంటి సమయంలో అందరూ ఒక్కటిగా ఉండి.. ప్రజల ఆరోగ్యం కోసం అందరూ స్వచ్చంధంగా షాపులు మూసివేయాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.

Updated Date - 2020-07-14T17:34:06+05:30 IST