నృసింహుడికి సంప్రదాయ పూజలు

ABN , First Publish Date - 2022-07-07T06:02:11+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

నృసింహుడికి సంప్రదాయ పూజలు
నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జూలై 6: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. బుధవారం వేకువజా మున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టా అలంకార మూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని గజవాహన సేవలో తీర్చిదిద్ది సేవోత్సవం చేపట్టి, నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ముందుగా విశ్వక్సే నుడిని ఆరాదిస్తూ సుదర్శన నారసింహ హోమ పూజలు నిర్వహించారు. పాత గుట్ట ఆలయంలోనూ నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.14,16,110 ఆదాయం సమకూరింది. 


నృసింహుడి సేవలో బ్రిటీష్‌ హైకమిషన్‌ బృందం

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని బ్రిటీష్‌ హై కమిషన్‌ ప్రతినిధి బృందం దర్శించుకుంది. డాక్టర్‌ ఆండ్రూ ఫ్లేమింగ్‌, మెజారిటీ ట్రేడ్‌ కమిషనర్‌ అలెన్‌ జెమ్మెల్‌, డిప్యూటీ హై కమిషనర్‌ వరుణ్‌మాలిలకు అర్చకులు ఆలయ మర్యా దలతో స్వాగతం పలుకగా ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకు న్నారు. ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజల అనంతరం అష్టభుజి ప్రాకార మండపంలోని అద్దాల మండపం ఎదుట అర్చకులు ఆశీ ర్వచనం చేశారు. బృందం వెంట తెలంగాణ చీఫ్‌ ఇన్నోవేషన్‌ అధికారి డాక్టర్‌ శాంతా తౌటం, దేవస్థాన పర్యవేక్షకులు వేముల వెంకటేశం, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-07-07T06:02:11+05:30 IST