హైవేపై ట్రాఫిక్‌ కష్టాలు..!

ABN , First Publish Date - 2021-10-27T05:29:36+05:30 IST

ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో హైవే రోడ్డు మార్జిన్‌ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.

హైవేపై ట్రాఫిక్‌ కష్టాలు..!
త్రిపురాంతకం సెంటర్‌లో నిలిచిన వాహనాలు



మార్జిన్‌ స్థలాల ఆక్రమణ

రోడ్డుపై ఇష్టానుసారంగా బైకుల పార్కింగ్‌

పాదచారులకు తప్పని ఇబ్బందులు

చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి

ఎర్రగొండపాలెం,  అక్టోబరు 26 : ఎర్రగొండపాలెం  మండల కేంద్రంలో హైవే రోడ్డు మార్జిన్‌ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరమవుతోంది. హైవేపై ఎక్కడబడితే అక్కడ వాహనాలను ఇ ష్టానుసారంగా పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో అటు ఇటు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పాదచారులు నడవాలంటే ఇబ్బందులకు గురిఅవుతున్నారు. మండల కేంద్రంలోని కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందులు పడుతు న్నారు. వాహనాలు నిలిచిపోతుండడంతో కొంత సమయం నిరీక్షించాల్సిన పరి స్థితి నెలకొంటోంది. దీంతో విద్యార్థులు నరకం చూస్తున్నారు.   ఎర్రగొండపా లెం  నుంచి త్రిపురాంతకం  వెళ్లే రోడ్డులో మూల మలుపు వద్ద ఆర్టీసీ బస్సు లు పార్కింగ్‌ చేయడం వలన అక్కడ నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఎర్రగొండపాలెం అంబేడ్కర్‌ సెంటరు నుంచి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేం ద్రం వరకు హైవే రోడ్డు డివైడర్‌ నుంచి 50 అడుగులు వెడల్పు ఉన్నప్పటికీ కాల్వలదాటి ప్రైవేటు భవనాల యజమానులు 20 అడుగుల మేరకొన్ని చోట్ల ఆక్రమణలు చేశారు. హైవే రోడ్డుకు ఇరువైపులా కాల్వలు దాటి మార్జిన్‌ స్థలా లను ఆక్రమించారు. దీంతో ఎర్రగొండపాలెం టౌన్‌కు పనిమీద వచ్చే వ్యక్తులు ద్విచక్రాహనాలను రోడ్డుపై పార్కింగ్‌ చేయడానికి వీలులేకుండా పోయింది. హైవే రోడ్డు  మార్జిన్‌ స్థలాలు  ఆక్రమిస్తున్నా అడ్డుకునే అధికారే కరువ య్యారు. డ్రైనేజీ కాలువమీద కూడా బంకులను ఏర్పాటు చేయడం వలన కా ల్వల్లో పేరుకుపోయిన చెత్తను కూడా నెలల తరబడి తొలగించడానికి వీలు లేకుండా పోయింది. ఎర్రగొండపాలెంలో  ట్రాఫిక్‌ సమస్యను తొలగించాలంటే రోడ్డు మార్జిన్‌లలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని ప్రజలు  అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-10-27T05:29:36+05:30 IST