Watch: జాతీయ రహదారిపై ఉన్నట్టుండి ఆగిన వాహనాలు... ఇంతలో ప్రత్యక్షమైన పులి... ఊహించని విధంగా...

ABN , First Publish Date - 2022-07-24T15:35:22+05:30 IST

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఒక వీడియో షేర్...

Watch: జాతీయ రహదారిపై ఉన్నట్టుండి ఆగిన వాహనాలు... ఇంతలో ప్రత్యక్షమైన పులి... ఊహించని విధంగా...

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఒక వీడియో షేర్ చేసి "ఈ తెలియని ప్రదేశంలో పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్’’ అని క్యాప్షన్ రాశారు. ఈ వైరల్ వీడియోలో ఒక ట్రాఫిక్ పోలీసు రహదారికి ఇరువైపులా వాహనదారులను నిలిపివేసి, ప్రశాంతంగా ఉండమని సంకేతాలు ఇచ్చారు. అప్పుడు చెట్ల వెనుక నుండి ఒక పులి బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వాహనదారులు తమ ఫోన్లతో పులికి ఫోటోలు తీశారు.  


ఆ పులి నెమ్మదిగా రోడ్డు దాటేంతవరకూ వాహనదారులు  వేచిచూశారు. ఈ వీడియోను ఇప్పటి వరకూ 1.1 లక్షలకు పైగా నెటిజన్లు చూశారు. ఒక్క రోజులో వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.  కొందరు నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. కొందరు యూజర్లు ఈ ఫుటేజీని చూసి ఆశ్చర్యపోతూ, సంఘటన జరిగిన స్థలం ఎక్కడ అని అడిగారు. మరొక యూజర్ "ఇతర దేశాల్లో ఇలాంటివి ఎప్పుడూ కనిపించవు. భారతదేశంలోనే కనిపిస్తాయి అని రాశారు. మరొకరు"ఇది మహారాష్ట్రలోని బ్రహ్మపురి-నాగభీర్ మధ్యగల జాతీయ రహదారి అని’’ తెలిపారు. మరొక యూజర్ "చాలా అరుదైన ఘటన... ఈ పులి మానవ ఉనికిని అంగీకరించిందా? లేక ఆకలితో ఉందా?" అని రాశారు.

Updated Date - 2022-07-24T15:35:22+05:30 IST