పామూరులో ట్రాఫిక్‌ ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-08-15T04:58:16+05:30 IST

పామూరు పట్టణంలో రో జురోజుకూ ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతోంది.

పామూరులో ట్రాఫిక్‌ ఇక్కట్లు
రద్దీగా ఉన్న సీఎస్‌పురం రోడ్డు, మమ్మీడాడీ సెంటర్‌

పెరుగుతున్న వాహనాలు

ఆక్రమణలతో ఇరుకుగా మారుతున్న రోడ్లు

ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

పామూరు, ఆగస్టు 14 : పామూరు పట్టణంలో రో జురోజుకూ ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతోంది.  ఎదురె దురంగా రెండు వాహనాలు వచ్చినప్పుడు గంటల తరపడి రోడ్డుపై వాహనాలు నిలిచి ఉండాల్సిన ప రిస్థితి ఉంది. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి  గు రవుతున్నారు. గతంలో రోడ్లు విశాలంగా, వాహనాలు తక్కువంగా ఉండేవి, నేడు వాహనాలు పెరిగి ప్రధాన రోడ్లన్నీ కుంచించుకు పోతున్నాయి. దీంతో ప్రజలు, వాహనచోదకులు ట్రాఫిక్‌ ఇక్కట్లకు గురవుతున్నారు.  పట్టణంలో ప్రధానంగా మమ్మీడాడీ సెంటర్‌, సీఎస్‌ పురం రోడ్డు,  విరువూరు రోడ్డు, కనిగిరి రోడ్లలో వాహ నాలు అడ్డదిడ్డంగా పార్కింగ్‌  చేస్తున్నారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. మరోపక్క దుకాణదారులు రోడ్డు మార్జిన్‌లను ఆక్రమిస్తున్నారు.  కొందరు దుకాణ యజమానులు తోపుడు బండ్లు, స్వీటు బండ్లు, పండ్ల బళ్లకు స్థలాన్ని అద్దెకు ఇస్తు న్నారు. వారు మార్జిన్‌ నుంచి రోడ్డుపైకి వచ్చి మరీ వ్యాపారం చేస్తుండడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, సాయంత్రం స్కూల్‌, కాలేజీల బస్సుల హడావుడి ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి.  పట్టణంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నప్పటికీ పోలీసుల స్పందన లేదని ప్రజలు ఆరోపి స్తున్నారు. గతంలో రోడ్ల విస్తరణ కోసం అధికారులు ప్రధాన రోడ్లకు ఇరువైపులా పది అడుగుల మెర మార్కింగ్‌ కూడా ఇచ్చి మూడు సంవత్సరాలు గడిచి పోయింది. నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. పా మూరు పట్టణానికి మండల  ప్రజలతోపాటు పీ సీపల్లి,  సీఎస్‌పురం, నెల్లూరు జిల్లా వరికుంటపాడు, సీతారామపురం, గండిపాలెం, వింజ మూరు మం డలలాల నుంచి వివిధ పనుల నిమిత్తం రోజూ పా మూరుకు వచ్చివెళ్తుంటారు. దీంతో ట్రాఫిక్‌ చిక్కులు అధికమవుతున్నాయి.  

నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం

ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. శా ఖలో సిబ్బంది కొరత ఉంది. ప్రధాన కూడళ్ల వద్ద సిబ్బందిని ఉంచుతున్నాం. రోడ్ల విస్తరణ పనులను సంబంధిత అధికారులు సమ న్వయంతో చేపట్టాలి. 


Updated Date - 2022-08-15T04:58:16+05:30 IST