రిషికేశ్‌- యమునోత్రి హైవేపై రాకపోకల బంద్‌

ABN , First Publish Date - 2022-05-22T07:43:11+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌- యమునోత్రి జాతీయ రహదారి మరోసారి మూతబడింది.

రిషికేశ్‌- యమునోత్రి హైవేపై రాకపోకల బంద్‌

10వేల మందికిపైగా రహదారిపైనే నిలిచిపోయిన వైనం

న్యూఢిల్లీ, మే 21: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌- యమునోత్రి జాతీయ రహదారి మరోసారి మూతబడింది. ఈ జాతీయ రహదారిపై ఓ ప్రాంతంలో రోడ్డు ధ్వంసం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో 10 వేల మందికి పైగా ప్రజలు రహదారి పొడవునా ఎక్కడికక్కడ నిలిచిపోయారు. జంకీచట్టి ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రోడ్డును మరమ్మతు లు చేసేందుకు 3 రోజులు పడుతుందని అధి కారులు అంటున్నారు. బుధవారం భారీ వర్షానికి సయనాచట్టి, రణచట్టి ప్రాంతాల మధ్యలో రహదారి కోతకు గురికావడంతో రాకపోకలు స్తంభించాయి. 24 గంటలు కూడా గడవకముందే మరోసారి అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2022-05-22T07:43:11+05:30 IST