బైక్‌పై ఏకంగా 92 చలాన్లు.. అవాక్కైన మేడ్చల్ పోలీసులు

ABN , First Publish Date - 2021-06-17T21:41:29+05:30 IST

బైక్‌పై ఏకంగా 92 చలాన్లు.. అవాక్కైన మేడ్చల్ పోలీసులు

బైక్‌పై ఏకంగా 92 చలాన్లు.. అవాక్కైన మేడ్చల్ పోలీసులు

మేడ్చల్: వాహనాలు తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ అవాక్కయ్యారు. ఒక వాహనంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 92 చలాన్లు ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరేడ్ మెట్‌లో మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రెండు బైకుల మీద ఉన్న పెండింగ్ చలాన్లు చూసి అవాక్కయ్యారు. యూసుఫ్‌గూడకు చెందిన మునావర్ అనే వ్యక్తికి చెందిన టూ వీలర్ బైక్‌పై 52 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మరో వ్యక్తికి చెందిన బైక్‌పై ఏకంగా 92 పెండింగ్ చలాన్లు ఉండటంతో రెండు బైకులను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2021-06-17T21:41:29+05:30 IST