HYD: బైక్‎పై ఉన్న చలాన్లు చూసి అవాక్కయిన పోలీసులు

ABN , First Publish Date - 2021-12-07T13:27:01+05:30 IST

అంబర్‎పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీలు చేస్తుండగా..ఓ వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను చూసి పరారయ్యాడు. (AP 23 M 9895) హీరో హోండా ప్యాషన్ బైక్‎ను పోలీసులు

HYD: బైక్‎పై ఉన్న చలాన్లు చూసి అవాక్కయిన పోలీసులు

హైదరాబాద్: అంబర్‎పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీలు చేస్తుండగా..ఓ వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను చూసి పరారయ్యాడు. (AP 23 M 9895) హీరో హోండా ప్యాషన్ బైక్‎ను పోలీసులు అనుమానంతో చలానాలను చెక్ చేశారు. బైక్ మీద ఉన్న చలానాలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. బైక్‎పై మొత్తం 179 పెండింగ్ చలాన్లు..అంటే మొత్తం రూ.42,475లు ఉండటంతో వాహనదారుడు బైక్‎ను వదిలి పరారయ్యాడని ట్రాఫిక్ పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు. భారీగా చలాన్లు ఉండటంతో పోలీసులు బైక్‎ను కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.

Updated Date - 2021-12-07T13:27:01+05:30 IST