Traffic restrictions: తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాలు... రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-09-16T19:59:39+05:30 IST

తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic restrictions: తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాలు... రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బహిరంగ సభ జరుగనుంది. 33 జిల్లాల నుండి 2300 బస్సులలో 1 లక్ష మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ (Ranganath) మాట్లాడుతూ... సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ (Telangana CM) సభకు 1లక్ష మందితో మీటింగ్ జరుగనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్, అంబేద్కర్ విగ్రహం వద్ద  కళాకారుల ప్రదర్శనలు, పలు కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 2300 బస్సులో 1 లక్షకు పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో సెంట్రల్ జోన్‌తో పాటు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.


ఇందిరా పార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర పూర్తిగా స్థాయి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. హైదరాబాద్‌లోని 9 జంక్షన్‌లలో ప్రయాణికులు రూట్ మార్చుకోవాలని సూచించారు. కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు, లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్‌లలో ట్రాఫిక్ పూర్తిగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ జోన్‌లో ప్రధానంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం జరగవచ్చని.. వాహన దారులు గ్రహించి ఈ ఏరియాను డైవర్ట్ చేసుకోవాలని అన్నారు. నెక్లెస్ రోడ్ , పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజ్‌లో జిల్లాల నుండి వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, పోలీస్, అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా జరుగేందుకు ఏర్పాట్లు చేశామని... ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్  కోరారు. 


Updated Date - 2022-09-16T19:59:39+05:30 IST