జగిత్యాలలో ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్సై అనిల్
జగిత్యాల అర్బన్, డిసెంబరు 2: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రమాద రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పట్టణ ట్రాఫిక్ ఎస్సై అనిల్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్లో
ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటరమణ, సీఐ జయేష్రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవగా హన నిర్వహించామన్నారు. పార్కింగ్ ఏరియా, వాహన పత్రాలు, అదనపు ప్యాసింజర్తో ప్రయాణం చేయరాదన్నారు. డ్రైవర్ పక్కన సీట్స్ను తొలిగించాలని, ప్రతి డ్రైవర్ విధిగా యూనిఫాం ధరించాలని సూచించారు. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటోవాలాలు పాల్గొన్నారు.