ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2022-01-23T04:59:43+05:30 IST

వాహనదారులందరూ తప్పని సరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని బద్వేలు అర్బన్‌ సీఐ రామచంద్ర పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
బద్వేలులో ట్రాఫిక్‌ పనులను పరిశీలిస్తున్న సీఐ

బద్వేలు, జనవరి 22 : వాహనదారులందరూ తప్పని సరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని బద్వేలు అర్బన్‌ సీఐ రామచంద్ర పేర్కొన్నారు. బద్వేలు పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పా టు చేయడం జరిగిందని వాహనదారులు వాటిని గమనిస్తూ ట్రాఫిక్‌  నిబంధనలు పాటించాలన్నారు.  పట్టణం లో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ  పనులను సీఐ చేపట్టారు. 


మాస్క్‌లేని వారిపై స్పెషల్‌ డ్రైవ్‌ 


పోరుమామిళ్ల, జనవరి 22 : మాస్కులు వాడని వారి పై ఎస్‌ఐ హరిప్రసాద్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం  స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మాస్కులు వాడని వారికి ఎస్‌ఐ జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నే పథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని మాస్కులు లేకుండా వాహనాల్లో వెళ్లే వారికి, పాదచారులకు కూడా జరిమానా తప్పదన్నారు. షాపులు నిర్వహించే యజమానులు షాపుల వద్దకు వచ్చే కస్టమర్లకు  మాస్కులు ఉండేలా చూడాలన్నారు. లేనిపక్షంలో వారికి కూడా అపరాధ రుసుం తప్పదన్నారు. 



Updated Date - 2022-01-23T04:59:43+05:30 IST