పండుగ పూట విషాదం

ABN , First Publish Date - 2020-10-27T11:35:07+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని పలు కుటుంబాల్లో పండుగ పూట విషాదం నెలకొంది. పలు సంఘటనల్లో సోమవారం 10మంది మృతిచెందగా ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది

పండుగ పూట విషాదం

ఉమ్మడి జిల్లాలో 10మంది మృతి


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు 26 : ఉమ్మడి జిల్లాలోని పలు కుటుంబాల్లో పండుగ పూట విషాదం నెలకొంది. పలు సంఘటనల్లో సోమవారం 10మంది మృతిచెందగా ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం చెరువుకుంటలో పడి వేముల మధు(10), చందు(8) మృత్యువాత పడ్డారు. చెరువులో బతుకమ్మ పూలు సేకరించేందుకు వెళ్లి మృత్యువాతపడ్డారు. తిప్పర్తి మండలంలోని ఎర్రగడ్డలగూడెం గ్రామంలో మేకలు కాసేందుకు వెళ్లిన మండలి వెంకన్న రెండో కుమారుడు శివ(17) ప్రమాదవశాత్తుబావిలో పడి మృతిచెందాడు. మద్దిరాల మండలంలోని గుమ్మడవెల్లిలో విద్యుదాఘాతంతో రైతు అంగెం సోమయ్య(60) మృతిచెందాడు. చివ్వెంల మండలంలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో తాడోజు నరేష్‌(28) మృతిచెందాడు. చింతపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లి గ్రామానికి చెందిన సీత యాకుబ్‌(32)  మృతిచెందాడు. భువనగిరి మండలంలోని అనంతారం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని దూల్‌పేటకు చెందిన ఠాకూర్‌ విజయ్‌సింగ్‌(50) తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. గుర్రంపోడు మండలం నడివారిగూడెం గ్రామానికి చెందిన నడ్డి రామలింగయ్య (43) అప్పుల బాధతో పురుగుమందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆడబిడ్డ కుమారుడు దూషించడని మనస్తాపంతో చ ండూరు మండ లం గట్టుప్పల్‌ గ్రామానికి చెందిన చిలువేరు పావని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మో త్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బెక్కంటి ఎల్లయ్య(50) కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

Updated Date - 2020-10-27T11:35:07+05:30 IST