ధర్మపురంలో విషాదం

May 9 2021 @ 23:05PM

భర్త, తండ్రి నాలుగురోజుల వ్యవధిలో కరోనాతో మృతి

ప్రస్తుతం ఆమె గర్భిణి

వజ్రపుకొత్తూరు: మండలంలోని ధర్మపురంలో విషాదం నెల కొంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత తండ్రి, భర్త నాలుగురోజుల వ్యవధిలో కరోనాతో మృతిచెందారు. నిండు గర్భిణి కావడంతో ఆమెకు ఈ విషయాన్ని తెలియనీయకుండా గ్రామస్థులు జాగ్రత్త పడుతున్నారు. ఆమె భర్తకు కరోనా నిర్ధారణ కావడంతో నాలుగు రోజుల కిందట విశాఖపట్నం చికిత్సపొందుతూ మరణించారు. తండ్రికి కరోనా బాధపడుతూ పలాసలో చికిత్సపొందుతూ ఆది వారం మృతి చెందారు. గర్భిణి కావడంతో ఆమెకు విషయం తెలిస్తే ఏమవుతుందోనన్న ఆందోళనతో గ్రామ స్థులు, కుటుంబ సభ్యులు భర్త, తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతు న్నారు. ఒకే కుటుంబంలో కరోనాతో ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


కరోనాతో ఇద్దరు మృతి

వజ్రపుకొత్తూరు: మండలంలో కరోనాతో ఆదివారం ఇద్దరు మృతిచెందారని తహసీల్దార్‌ బి.అప్పలస్వామి తెలిపారు. కొత్తగా 77 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. పాజిటివ్‌ వచ్చినవారు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొన్నారు. వీరంతా బయటకు తిరగకుండా వీఆర్వోలు, కార్యదర్శులు, సచి వాలయ ఉద్యోగులు, గ్రామవలంటీర్లు పరిశీలించాలని కోరారు.


పలాసలో వ్యాపారి...

పలాస: కరోనాతో  కాశీబుగ్గకు చెందిన ఓ తుక్కు వ్యాపారి మృతిచెందడంతో వ్యాపారులు ఆందోళన చెందు తున్నారు. ఆయన కు మూడురోజుల కిందట కరోనా సోక డంతో శ్రీకాకుళంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆది వారం మృతి చెందినట్లు తహసీల్దార్‌ మధుసూదనరావు కు సమాచారం అందడంతో ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపారు. 


 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.