నాని విడుదల చేసిన 'లోల్‌సలామ్‌' వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌..

Published: Sat, 12 Jun 2021 19:36:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నాని విడుదల చేసిన లోల్‌సలామ్‌ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌..

నేచురల్‌ స్టార్‌ నాని 'లోల్‌సలామ్‌' వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న సినిమాలను, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కంటెంట్‌ బాగుంటే అది సినిమా అయినా వెబ్‌సిరీస్‌ అయినా ఆదరణలో మాత్రం ఎటువంటి తేడా వుండదు. ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైవిధ్యమైన కథాంశంతో పలు వెబ్‌సిరీస్‌లు వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మంచి కథాంశంతో ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా 'లోల్‌సలామ్‌' పేరుతో జీ-5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వెబ్‌సిరీస్‌ రాబోతుంది. ఆరు ఎపిసోడ్స్‌లతో పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ వెబ్‌సీరిస్‌ జూన్ 25న విడుదల కాబోతుంది. కాగా ఈ వెబ్‌సీరిస్‌ ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్వీట్టర్‌ ద్వారా విడుదల చేసి తన శుభాకాంక్షలు అందజేశారు. ఈ వెబ్‌సీరిస్‌ విశేషాలను క్రియేటర్‌ అండ్‌ డైరెక్టర్‌ నాని తెలియజేస్తూ.. 'కరోనాతో ఒత్తిడితో  వున్న అందరిని పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌ చేయడమే మా ధ్యేయం. దైనందిన జీవితంలో వున్న టెన్షన్‌లను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురి యువకుల్లో అనుకోకుండా ఒకరు అడవిలో ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది? వాళ్లు అక్కడి నుండి ఎలా బయటపడ్డారు.. అనేది పూర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలిచాం. 40 కొత్త ఆర్టిస్టులతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాం’.. అని తెలిపారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International