ltrScrptTheme3

‘పుష్పక విమానం’.. ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

Oct 27 2021 @ 16:50PM

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పుష్పక విమానం’. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, గీతా శైనీ, శాన్వి మేఘన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర దర్శకత్వంలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండటం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతీది మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ నెల 30న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.