ప్రయాణికులకు విజ్ఞప్తి: ఒకే రూట్‌లో వెళ్లే రైళ్ల ఛార్జీల్లో తేడాలు ఎందుకు ఉంటాయో తెలుసుకోండి.. మీ విజ్ఞానాన్ని పెంచుకోండి!

ABN , First Publish Date - 2022-01-02T15:16:05+05:30 IST

భారతీయ రైల్వేలు అన్ని తరగతుల..

ప్రయాణికులకు విజ్ఞప్తి: ఒకే రూట్‌లో వెళ్లే రైళ్ల ఛార్జీల్లో తేడాలు ఎందుకు ఉంటాయో తెలుసుకోండి.. మీ విజ్ఞానాన్ని పెంచుకోండి!

భారతీయ రైల్వేలు అన్ని తరగతుల ప్రయాణీకులకు సేవలను అందిస్తాయి. వారిని గమ్యస్థానాలకు చేరుస్తాయి. పలు రకాల రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ ఆ రైళ్లలో అనేక రకాల కోచ్‌లను కూడా ఏర్పాటు చేసింది. తద్వారా ప్రయాణీకులు తమ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ప్రయాణాలు చేయగలుగుతారు. స్లీపర్‌లో తక్కువ ఛార్జీలు.. ఏసీలో ఎక్కువ ఛార్జీలు ఉంటాయనే విషయం విదితమే.. అయితే ఒకే రూట్‌లో వెళ్లే వివిధ రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఎందుకు ఉంటాయనే ప్రశ్న ప్రయాణికులందరి మదిలో మెదులుతుంది. దీని వెనుక గల కారణం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రైలులో ఏ ప్రాతిపదికన ఛార్జీలు నిర్ణయిస్తారో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? అయితే ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకోండి. 


మీరు ప్రయాణించే రైలు కేటగిరీని అనుసరించి ఛార్జీలు ఉంటాయి. ఈ రైళ్లలో సబర్బన్ రైలు, మెయిల్ రైలు, ఎక్స్‌ప్రెస్ రైలు, ఏసీ సర్వీస్ రైలు మొదలైనవి ఉంటాయి. ఇవే కాకుండా ఈ వీటికి బిన్నంగా కొన్ని రైళ్లలో ఛార్జీలు ఉంటాయి. గరీబ్ రథ్, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, గతిమాన్, జన్ శతాబ్ది, ప్రత్యేక రైళ్లు ఈ కోవలోకి వస్తాయి. సాధారణంగా ప్రయాణికుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడనే దాని ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తారు. ఇది రైలు కేటగిరీని అనుసరించి ఉంటుంది. ఈ ఛార్జీలలో కనీస దూర ఛార్జీ, కనీస సాధారణ ఛార్జీలు, రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ ఛార్జీలు మొదలైనవి ఉంటాయి. వీటన్నింటిలో టిక్కెట్ల రేట్లు ఒకేలా ఉండవు. ఉదాహరణకు, సూపర్ ఫాస్ట్ రైళ్లలో మాత్రమే సూపర్ ఫాస్ట్ ఛార్జీలు విధిస్తారు. 1 నుంచి 5 కి.మీ. 6-10, 11-15, 16-20, 21-25 ఇలా దూరాన్ని అనుసరించి ఛార్జీలు ఉంటాయి. ఇక తత్కాల్ టిక్కెట్ విషయానికొస్తే.. తత్కాల్ ఛార్జీలు అదనంగా జోడిస్తారు. అది కూడా కిలోమీటర్ల  ఆధారంగానే ఉంటుంది. ఆ ఛార్జీలతో కలిపి తత్కాల్ టిక్కెట్ రేటును నిర్ణయిస్తారు. 

Updated Date - 2022-01-02T15:16:05+05:30 IST