Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి..

ABN , First Publish Date - 2022-09-07T02:36:41+05:30 IST

ఓ వ్యక్తి భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి..

ఓ వ్యక్తి భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. వేగంగా దూసుకువస్తున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడుక్కుని బతికిపోయాడు.  ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఇటావా జిల్లా భరతాన రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఆగ్రా భరతాన రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం 9.45 నిమిషాలకు ఓ వ్యక్తి కొన్ని సామానులు పట్టుకుని పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు.


అంతలోనే ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొస్తోంది. ఫ్లాట్‌ఫామ్‌ ఎక్కే వీలు ఉండదని గ్రహించిన ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించాడు. ఫ్లాట్‌ఫామ్‌‌కు, రైలు పట్టాలకు మధ్యలో కదలకుండా పడుకుని ఉండిపోయాడు. అతనికి ఏమైందోనని అక్కడున్న వారంతా ఊపిరి బిగబట్టి చూశారు. అతడు బతికే అవకాశం లేదని భావించారు. రైలు వెళ్లిపోయాక పైకి లేచిన అతడిని చూసి ఊపిరి పీల్చుకున్నారు. అతను పైకి లేచి తనకోసం ఎదురు చూసినవారందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. 

Updated Date - 2022-09-07T02:36:41+05:30 IST