సంక్షేమ పథకాల అమలులో ఇబ్రహీంపూర్‌ భేష్‌

ABN , First Publish Date - 2022-07-06T05:53:45+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వినియోగంలో ఇబ్రహీంపుర్‌ గ్రామం ముందున్నదని నాగాలాండ్‌కు చెందిన ట్రైనీ సివిల్‌ సర్విసెస్‌ అధికారుల బృందం కితాబిచ్చింది. నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపుర్‌ మంగళవారం గ్రామాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న నాగాలాండ్‌ ట్రైనీ అధికారుల బృందం సందర్శించింది. గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

సంక్షేమ పథకాల అమలులో ఇబ్రహీంపూర్‌ భేష్‌
ఇబ్రహీంపుర్‌లో పాఠశాలను పరిశీలిస్తున్న నాగాలాండ్‌ ట్రైనీ అధికారులు

నాగాలాండ్‌ ట్రైనీ సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల బృందం కితాబు


నారాయణరావుపేట, జూలై 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వినియోగంలో ఇబ్రహీంపుర్‌ గ్రామం ముందున్నదని నాగాలాండ్‌కు చెందిన ట్రైనీ సివిల్‌ సర్విసెస్‌ అధికారుల బృందం కితాబిచ్చింది. నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపుర్‌ మంగళవారం గ్రామాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న నాగాలాండ్‌ ట్రైనీ అధికారుల బృందం సందర్శించింది. గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకం, వ్యవసాయ భూముల్లో కందకాలు, శ్మశానవాటిక, పకృతివనం, తడి, పొడి చెత్త వేరుచేసే విధానం, డంపింగ్‌ యార్డుల్లో సేంద్రియ ఎరువుల తయారీ, పశువుల షెడ్లు, పశువుల హాస్టల్‌, సాముహిక గొర్రెల షెడ్లు,  హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ భవనంలో పాలకమండలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల చైతన్యం, నాయకుల చొరవతో గ్రామం అభివృద్ధిబాటలో నడుస్తున్నదని కొనియాడారు.  కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, డీఆద్డీఏ ఏపీడీ ఓబులేష్‌, ఎంపీపీ బాలకృష్ణ, ఎంపీడీవోలు సమ్మిరెడ్డి, మురళీధర్‌శర్మ, జడ్పీటీసీ లక్ష్మీరాఘవరెడ్డి, పోగ్రాం అధికారి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ దేవయ్య, పంచాయతీ కార్యదర్శి హర్షత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:53:45+05:30 IST