శిక్షణ కేంద్రాల్ని పరిశీలించిన సీ డాప్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-01-23T06:42:39+05:30 IST

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాల ను సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలెప్‌మెంట్‌ ఇన్‌ ఏపీ (సీ– డాప్‌) చైర్మన్‌ శ్యాంప్రసాద్‌ రెడ్డి శనివారం పరిశీలించారు.

శిక్షణ కేంద్రాల్ని పరిశీలించిన సీ డాప్‌ చైర్మన్‌
శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడుతున్న సీడాప్‌ చైర్మన్‌

ఏలూరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాల ను సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలెప్‌మెంట్‌ ఇన్‌ ఏపీ (సీ– డాప్‌) చైర్మన్‌ శ్యాంప్రసాద్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. వట్లూరు టీటీడీసీలో  ఎస్‌ఆర్‌ టీపీ శిక్షణా కేంద్రం, సత్రంపాడులో డాటా– ప్రో ద్వారా నిర్వహిస్తున్న కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, కస్టమర్‌ రిలేషన్‌ మేనేజ్‌మెంట్‌ శిక్షణా కేంద్రం, రామచంద్రరావుపేటలోని ఆరా సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వెబ్‌– డెవలపర్స్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజస్‌ శిక్షణా కేంద్రాలను ఆయన పరిశీలించారు. డీఆర్‌డీఏ జేడీఎం కె.పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో 5 శిక్షణా కేంద్రాల్లో 150 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చామని, వారిలో 108 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు.     

Updated Date - 2022-01-23T06:42:39+05:30 IST