28న కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ శిక్షణ శిబిరం

ABN , First Publish Date - 2022-01-22T05:05:50+05:30 IST

జిల్లా కాంగ్రెస్‌ నేతలకు, మండల స్థాయి నాయకులకు ఈ నెల 28న కాకినాడలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్‌ లూధర్‌ తెలిపారు.

28న కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ శిక్షణ శిబిరం

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21: జిల్లా కాంగ్రెస్‌ నేతలకు, మండల స్థాయి నాయకులకు ఈ నెల 28న కాకినాడలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్‌ లూధర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ గోలి రవి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికి రెండులక్షల సభ్యత్వాలకు దగ్గరలో ఉన్నామని చెప్పారు. జనజాగరణ, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఉద్యమం వంటి వాటిని నిర్వహించామని చెప్పారు. పార్టీ అధిష్టానం కాంగ్రెస్‌ను మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని అందులో భాగం గా 25 పార్లమెంట్‌ జిల్లాలకు ఇన్‌చార్జిలను, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున సమన్వయ కర్తలను నియమించిదని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ చైర్మన్‌గా నియమితులైన బండి విజయభాస్కరరావుకు నియమక పత్రాన్ని ఆయన, యూడ బ్ల్యూఈసీ చైర్మన్‌ ఎన్‌వీ శ్రీనివాసరావు అందించి అభినందించారు. కార్యక్రమంలో గోలి రవి, కొవ్వూరు ఇన్‌చార్జి అరిగెల అరు ణ, చిన్నం మురళీకష్ణ, గోపాలపురం ఇన్‌చార్జి జ్యేష్ట, సతీష్‌బాబు, నిడదవోలు ఇన్‌చార్జి పెదిరెడ్డి సుబ్బారావు, మట్టపర్తి రామ్మోహనరావు, కారింకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:05:50+05:30 IST