శిక్షణతో నైపుణ్యం పెంపు

ABN , First Publish Date - 2022-05-21T04:16:09+05:30 IST

చెక్క నగిషీ వస్తువుల తయారీలో మహిళలు శిక్షణ పొందితే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు అధిక ఆదాయం పొందవచ్చని నిఫ్ట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సత్యప్రకాష్‌ పేర్కొన్నారు.

శిక్షణతో నైపుణ్యం పెంపు
శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రం అందజేస్తున్న నిర్వాహకులు

ఉదయగిరి రూరల్‌, మే 20: చెక్క నగిషీ వస్తువుల తయారీలో మహిళలు శిక్షణ పొందితే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు అధిక ఆదాయం పొందవచ్చని నిఫ్ట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సత్యప్రకాష్‌ పేర్కొన్నారు. స్థానిక చెక్క నగిషీ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శుక్రవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్‌ మైనారిటీ ఆఫైర్స్‌ ఆధ్వర్యంలో నిఫ్ట్‌ సహకారంతో మహిళలకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఇప్పటికే కేంద్రంలో 160 రకాల వస్తువులు తయారు చేస్తున్నారన్నారు. మరో 30 రకాల గృహ అవసరాల వస్తువుల తయారీలో మహిళలకు శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ సమయంలో మహిళలకు రోజుకు రూ.500 పారితోషకం కూడా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డిజైనర్‌ అంకుర్‌కున్వార్‌, నిర్వాహకులు గౌసియా, బషీర్‌, జాకీర్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T04:16:09+05:30 IST