ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీవోలకు శిక్షణ

ABN , First Publish Date - 2021-03-01T04:36:23+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాల యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి మొదటి విడత శిక్షణ ఆదివారం ప్రారంభమైంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీవోలకు శిక్షణ
పీవోలు, ఏపీవోలకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట, ఫిబ్రవరి 28 : జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాల యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి మొదటి విడత శిక్షణ ఆదివారం ప్రారంభమైంది. కలెక్టర్‌ హరిచందన శిక్షణలో పాల్గొని ఎన్ని కల నిర్వహణపై సంపూర్ణ అవగా హన పొందాలని సిబ్బందికి సూ చించారు. పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్‌ తర్వాత నింపాల్సిన ఫారాలు, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పీవోస్‌ కరదీ పికను కలెక్టర్‌ చదివి వినిపించా రు. సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని ఆమె కోరారు. అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి మాట్లా డుతూ మొదటిసారి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శిక్షణలో అన్ని అంశాలు నేర్చుకొని, ఎన్నిక లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించా రు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్‌, నోడల్‌ అధికారి రవీందర్‌, ట్రైనర్స్‌ సత్యభాస్కర్‌రెడ్డి, దత్తు, కృష్ణమోహన్‌, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.


మహిళలు స్వశక్తితో ఎదగాలి

మహిళలు స్వశక్తితో ఎదగాలని కలెక్టర్‌ హరిచందన కోరారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మొవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని మహిళలకు ఉచిత డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్స్‌ క్లబ్‌లో జరిగిన రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న సంస్థకు ఆమె శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. డ్రైవింగ్‌లో శిక్షణ పొంది లర్నింగ్‌లో లైసెన్స్‌ తీసుకున్న మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, మొవో సంస్థ ఫౌండర్‌ జయభారతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T04:36:23+05:30 IST