Advertisement

రేపు సైన్స‌ ఉపాధ్యాయులకు శిక్షణ

Sep 25 2020 @ 01:19AM

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 24: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయులకు స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌పై శని వారం శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో దుర్గ్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు యునిసెఫ్‌, ఇంక్విలాబ్‌ సంస్థల సహకారంతో తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని 290 పాఠశాలల నుంచి ముం దే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఉపాధ్యాయులు తప్పకుండా శిక్షణలో పాల్గొనాలన్నారు. ఉదయం  10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. 

Follow Us on:
Advertisement
Advertisement