నాగర్‌సోల్‌ 2 రోజులు రద్దు

ABN , First Publish Date - 2021-05-07T05:45:52+05:30 IST

నరసాపురం – నాగర్‌ సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ను వారంలో ఐదు రోజులకు కుదించా రు.

నాగర్‌సోల్‌ 2 రోజులు రద్దు

నరసాపురం/ఆకివీడు మే 6 : నరసాపురం – నాగర్‌ సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ను వారంలో ఐదు రోజులకు కుదించా రు. ఈ నెలాఖరు వరకు శుక్ర, ఆదివారాల్లో ఈ రైలు నాగర్‌సోల్‌ వెళ్లదు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి నశ్రాత్‌ మండ్రు పకర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఎక్స్‌ప్రెస్‌ సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో వరంగల్‌ మీదుగా మిగిలిన రెండు రోజులు అంటే శుక్ర, అదివారాల్లో 07231 నెంబర్‌తో గుంటూరు మీదుగా నాగర్‌సోల్‌ వెళుతుంది. వరంగల్‌ మీదుగా వెళ్లే ఐదు రోజుల షెడ్యూల్‌ను యధావిధిగా కొనసాగించి, గుంటూరు మీదుగా వెళ్లే రెండు రోజుల షెడ్యూల్‌ను రద్దు చేశారు. శుక్ర, ఆదివారాల్లో ఈ రైలు షిర్డీ వెళ్లదు. అలాగే కాకినాడ – లింగంపల్లి (02775), లింగంపల్లి – కాకినాడ (02776) ట్రైన్లు శుక్రవారం నుంచి తిరగవని ఆకివీడు స్టేషన్‌ మాస్టర్‌ మాణిక్యం తెలిపారు. 

Updated Date - 2021-05-07T05:45:52+05:30 IST