పలు రైళ్ల దారి మళ్లింపు

Published: Sat, 25 Dec 2021 09:04:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పలు రైళ్ల దారి మళ్లింపు

చెన్నై: అరక్కోణం సమీపంలో వంతెన దెబ్బ తినడంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను దారి మళ్లించారు. వివిధ రాష్ట్రాల నుంచి చెన్నై మీదుగా వెళ్లాల్సిన రైళ్లను గూడూరు నుంచే దారి మళ్లించారు. అవి గూడూరు-రేణిగుంట- పాకాల- కాట్పాడి మీదుగా  గమ్యస్థానాలకు చేరుకుంటాయని దక్షిణరైల్వే ప్రకటించింది. 


ఆ రైళ్ల వివరాలు... 

- ఈ నెల 23, 24 తేదీల్లో నడిచే దానాపూర్‌ - కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌ సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ (12296).

- ఈ నెల 24, 25 తేదీల్లో వెళ్లే హౌరా - యశ్వంత్‌పూర్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12245).

- ఈ నెల 24న బయలుదేరిన పాటలీపుత్ర - యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22351).

- ఈ నెల 23న బయలుదేరిన పాట్నా - బానస్వాడి హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22353).

- ఈ నెల 23, 24 తేదీల్లో బయలుదేరిన ధన్‌బాద్‌ - అళప్పుళ ఎక్స్‌ప్రెస్‌ (13351).

- ఈ నెల 25న బయలుదేరే కొచ్చువేలి - ఇండోర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22646).

- ఈ నెల 23న బయలుదేరిన సిల్చర్‌ - తిరువనంతపురం సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12508).

- ఈ నెల 24న బయలుదేరిన లక్నో - యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12540).

- ఈ నెల 25, 26 తేదీల్లో బయలుదేరే అళప్పుళ - ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (13352).

- ఈ నెల 25వ తేదీన బయలుదేరే ఎర్నాకులం - పాట్నా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22669).

- ఈ నెల 25న బయలుదేరే యశ్వంతపూర్‌ - కామాఖ్యా ఏసీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12551).

- ఈ నెల 25న బయలుదేరే విల్లుపురం - పురూలియా బైవీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22606).

- ఈ నెల 26న బయలుదేరే తిరునల్వేలి - బిలాస్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22620).

- ఈ నెల 26వ తేదీన బయలుదేరే యశ్వంత్‌పూర్‌ - హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్‌ (12246).

ఈ కింది కొన్ని రైళ్లను ధర్మవరం, గుత్తి, డోన్‌, నంద్యాల, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ఇవి బెంగుళూర్‌ ఈస్ట్‌, కృష్ణరాజ పురం, బంగారపేట్‌, జోలార్‌పేట, కాట్పాడి, అరక్కోణం, పెరంబూర్‌, నెల్లూర్‌, ఒంగోలు స్టేషన్లకు వెళ్లకుండానే గమ్యస్థానాలకు చేరుకుంటాయి.

 

ఆ రైళ్ల వివరాలు.

- ఈ నెల 24న బయలుదేరిన బెంగుళూర్‌ కెంట్‌ - గువహతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12509).

- ఈ నెల 25, 26 తేదీల్లో బయలుదేరే కేఎస్‌ఆర్‌ బెంగుళూర్‌ - దానాపూర్‌ సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.