ఏడీఆర్‌ డాక్టర్‌ అనురాధ బదిలీ

ABN , First Publish Date - 2022-07-06T06:13:13+05:30 IST

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు(ఏడీఆర్‌) డాక్టర్‌ టి.అనురాధను బదిలీ చేస్తూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ గుత్తా రామరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏడీఆర్‌ డాక్టర్‌ అనురాధ బదిలీ
టి.అనురాధ

చింతపల్లి, జూలై 5: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు(ఏడీఆర్‌) డాక్టర్‌ టి.అనురాధను బదిలీ చేస్తూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ గుత్తా రామరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది నెలలుగా చింతపల్లిలో ఏడీఆర్‌గా సేవలందించిన ఆమెను రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల జెనెటిక్స్‌, ప్లాంట్‌ బ్రీడింగ్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. ఈ మేరకు పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సీతారామ్‌కు ఏడీఆర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి ఆమె రిలీవ్‌ అయ్యారు. అనురాధ చింతపల్లిలో తక్కువ కాలం పనిచేసినప్పటికీ సేంద్రియ పద్ధతిలో పంటల సాగుకు విశేష కృషి చేశారు. అలాగే పూలసాగుపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ కాలం ఏడీఆర్‌గా పనిచేసినప్పటికి గిరిజన ప్రాంతంలో ఉద్యోగం చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. 

Updated Date - 2022-07-06T06:13:13+05:30 IST