ప్రకాశం: జిల్లాలోని కనిగిరిలో కమిషనర్ల బదిలీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బదిలీపై కనిగిరి కార్యాలయానికి నూతన కమిషనర్ డీటీవీ కృష్ణారావు వచ్చారు. అయితే గ్రేస్ పీరియడ్ ఇంకా ఉన్నందున రిలీవ్ కాలేదని ప్రస్తుత కమిషనర్ చెబుతున్నారు. ఇద్దరు కమిషనర్లు ఆఫీస్‌లోనే ఉండడంతో సిబ్బంది అయోమయంలో పడ్డారు.