అమరావతి: రాష్ట్రంలో ముగ్గురు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబును ఇంటెలిజెన్స్కు బదిలీ చేశారు. కర్నూలు ఎస్పీ ఫకీరప్పను అనంతపురం ఎస్పీగా నియమించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్న సుధీర్కుమార్రెడ్డిని కర్నూలు ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.