బదిలీల జాతర!

ABN , First Publish Date - 2022-07-02T06:36:47+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు జీవోను ప్రభుత్వం జారీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా జి.శ్రవణ్‌కుమార్‌ను నియమించారు.

బదిలీల జాతర!
ఎంపీడీవోలకు బదిలీ పత్రాలను అందజేస్తున్న జడ్పీ చైర్మన్‌ వేణుగోపాలరావు

  • రుడా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా జీ శ్రవణ్‌కుమార్‌ 
  • కుడా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా ఏ వెంకట్రావు

రాజమహేంద్రవరం సిటీ, జూలై1: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు జీవోను ప్రభుత్వం జారీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా జి.శ్రవణ్‌కుమార్‌ను నియమించారు. గ్రేడ్‌-2 రిజర్వుడ్‌లో ఉన్న ఆయనను రుడాకు బదిలీ చేశారు. అలాగే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌.కాళిబాబును కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సెక్రటరీగా నియమించారు. ఆయన స్థానంలో రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థ సెక్రటరీగా జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ బీవీ రమణను నియమించారు. ప్రజారోగ్య విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎం.నారాయణరావును ఏపీయూఎఫ్‌ఐడీసీ ఇంజినీర్‌ గా బదిలీచేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఈఈగా పనిచేసిన శేషగిరిరావును కాకినాడ నగరపాలక సంస్థకు బదిలీ చేశారు. ఆయన స్థానం లో కడప మునిసిపాలిటీ నుంచి ఎ.గిరిధర్‌ ఈఈగా రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు బదిలీ అయ్యారు. ఏపీ టిడ్కో గుంటూరు జిల్లా సూపరింటెండెంట్‌గా ఉన్న ఎంసీ కోటేశ్వరరావు రాజమహేందవ్రరం టిడ్కో ఎస్‌ఈగా బదిలీ చేశారు. ఇప్పటివరకు రాజమహేంద్రవరం టిడ్కోలో విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాసరావును గుంటూరు టిడ్కోకు బదిలీ చేశారు.

కాకినాడ జిల్లాలో..

కాకినాడ సిటీ, జూలై 1: సెలవులో ఉండి చేరిన గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ హోదా గల ఎ.వెంకట రావును కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. గ్రేడ్‌ -2 మున్సిపల్‌ కమిషనర్‌ హోదా కలిగి రాజమహేం ద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సెక్రటరీగా పనిచే స్తున్న ఆర్‌ కాళిబాబు కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) సెక్రటరీగా నియమించారు. కాకినా డ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్‌ సత్యనారాయణరావు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ ప్రా జెక్టు ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఏపీ సెక్రటేరియల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కోన శ్రీనివాస్‌ కాకినాడ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై రానున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సత్యనారాయణ గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. 

కలెక్టరేట్‌లోనూ బదిలీలు

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), జూలై 1 : తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లోనూ బదిలీలు జరిగాయి. కలెక్టర్‌ మాధవీలత ఇప్ప టికే పలువురు జిల్లా స్థాయి అధికార్ల బదిలీని ప్రతిపాదించి ఆయా హెడ్‌ ఆఫీసులకు పంపించారు. శనివారం ఎవరు ఎక్కడికనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆనోటా ఈనోటా అందిన సమాచారం ప్రకారం.. సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ తులసిని కోనసీమ జిల్లా సివిల్‌ సప్లయిస్‌ డీఎంగా బదిలీ చేశారు. అక్కడ డీఎంగా పనిచేస్తున్న తనూజను తూర్పుగోదావరి జిల్లా బీఎంగా రాజమహేంద్రవరానికి బదిలీ చేశారు. వాస్తవానికి కొత్తగా కలెక్టరేట్‌ ఏర్పడిన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులంతా కొత్తగానే వచ్చారు. కాబట్టి, వారెవరికీ బదిలీలు ఉండవనుకున్నారు. కారణాలు ఏంటో మరి, ఒక వేళ జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత తన టీమ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలనుకున్నారో ఏమో కానీ కొంతమందికి బదిలీలు తప్పనిసరి అయినట్టు సమాచారం. ధవళేశ్వరం ఇరిగేషన్‌ టి.రాంబాబును ఏలూరు నీరు-ప్రగతి ఎస్‌ఈగా బదిలీ చేశారు. కొద్దిరోజుల కిందట ఆయన వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. వాస్తవానికి ఇవాళో రేపో ఆయన ఇక్కడ విధులకు హాజరుకావలసి ఉంది. కానీ సాధారణ బదిలీలలో భాగంగా ఆయనను ఏలూరు మార్చారు. ప్రస్తుతం ఇక్కడ ఎవరినీ ఎస్‌ఈగా నియమించలేదు. పోలవరం ఎస్‌ఈగా ఉన్న నరసింహమూర్తి ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ధవళేశ్వరం సీఈగా రేవు సతీష్‌కుమార్‌ నియమితులయ్యారు.

పలువురు ఏపీపీలకూ స్థాన చలనం

కాకినాడ క్రైం, జూలై 1: జిల్లాలో పనిచేస్తున్న పలువురు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ)లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాకినాడ 5వ ఏజేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీగా విధులు నిర్వర్తిస్తున్న బి.రామతులసి భీమవరం 1వ ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ అయ్యారు. కాకినాడ 3వ ఏజేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీగా పనిచేస్తున్న ఏబీ అప్పారావు తాడేపల్లిగూడెం 2వ ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు స్థానచలనం పొందారు. రామచంద్రపురం ఏజేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీగా పనిచేస్తున్న కె.సుధారాణి కాకినాడ 3వ ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ అయ్యారు. రాజమహేంద్రవరం 5వ ఏజేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీగా బదిలీ అయ్యారు. ముమ్మిడివరం ఏజేఎఫ్‌ సీఎం కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జి.విజయ కాకినాడ ప్రత్యేక మొబైల్‌కోర్టు ఏపీపీగా స్థానచలనం పొం దారు. ఇక ఇప్పటివరకు కాకినాడ ప్రత్యేక జేఎఫ్‌సీఎం మొబైల్‌కోర్టు ఏపీపీగా వ్యవహరిస్తున్న ఎన్‌ఎన్‌ రాధిక ముమ్మిడివరం జేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ అయ్యారు.

పారదర్శకంగా అధికారుల బదిలీలు : జడ్పీ చైర్మన్‌

కాకినాడ సిటీ, జూలై 1: జిల్లా పరిషత్‌ పరిధిలో అధికారుల బదిలీలు పారదర్శకంగా జరిగాయని జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోల బదిలీల జాబితా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పరిధిలో 14 మంది ఎంపీడీవోలను నిబంధనల ప్రకారం చేపట్టామన్నారు. ఉద్యోగులు చేసుకున్న ఆప్షన్‌లను పరిగణనలోకి తీసుకుం టూ పారదర్శకంగా ఈ బదిలీలు నిర్వహించామన్నారు. జడ్పీ పరిధిలో 476 మంది ఉద్యోగులను ఇబ్బందులు లేకుండా కోరుకున్న స్థానాలకు బదిలీ చేయడం జరిగింద న్నారు. ఈ సందర్భంగా 14 మంది ఎంపీడీవోలకు బదిలీ ఉత్తర్వులను చైర్మన్‌ వేణుగో పాలరావు చేతులమీదుగా అందజేశారు. సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డిప్యూటీ సీఈవో నారాణయమూర్తి, ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:36:47+05:30 IST