ఎక్సైజ్‌ శాఖలో స్థానచలనం

ABN , First Publish Date - 2021-06-15T05:05:19+05:30 IST

ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగంలో జిల్లాకు చెందిన 17మంది సీఐలకు స్థానచలనమైంది. ఈ మేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌, అమరావతి వినీత్‌ బ్రిజ్లాల్‌ ఉత్తర్వులను జారీచేశారు.

ఎక్సైజ్‌ శాఖలో స్థానచలనం

టెక్కలి, జూన్‌ 14: ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగంలో జిల్లాకు చెందిన 17మంది సీఐలకు స్థానచలనమైంది.  ఈ మేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌, అమరావతి వినీత్‌ బ్రిజ్లాల్‌ ఉత్తర్వులను జారీచేశారు. ఇందులో భాగంగా జిల్లాకు బదిలీపై వస్తున్న అధికారులను పరిశీలిస్తే.. టి.నాగేశ్వరరావు(శ్రీకాకుళం), కె.సునీల్‌కుమార్‌(ఆమదాలవలస), ఎ.శ్రీరంగందొర (నరసన్నపేట), బి.కిరణ్‌మీణేశ్వరి(రణస్థలం), పి.శ్రీనివాసరావు (పొందూరు), ఎస్‌.విజయ్‌కుమార్‌(పాలకొండ), టి.దుర్గాప్రసాద్‌(రాజాం), వై.లక్ష్మునాయుడు(పాతపట్నం), అబ్దుల్‌కలాం(కొత్తూరు), డి.అనీల్‌కుమార్‌(టెక్కలి), బి.నాగవేణి (కోటబొమ్మాళి), పి.వెంకటప్పలనాయుడు (సోంపేట), వై.రాజు(ఇచ్ఛాపురం)లను స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా నియమించారు. ఇక శ్రీకాకుళం డీటీఎఫ్‌గా బి.నర్శింహమూర్తి, పలాస డీటీఎఫ్‌గా జి.సతీష్‌కుమార్‌, పురుషోత్తపురం చెక్‌పోస్ట్‌ సీపీగా జె.శ్రీనివాసరావు, ఇంటెలిజెన్స్‌ వింగ్‌కు బీవీ మురళీధర్‌లను నియమించారు.

Updated Date - 2021-06-15T05:05:19+05:30 IST