ఇంద్రకీలాద్రిపై భారీ కదలికలు

ABN , First Publish Date - 2022-07-02T06:11:19+05:30 IST

ఇంద్రకీలాద్రిపై భారీ కదలికలు

ఇంద్రకీలాద్రిపై భారీ కదలికలు

49 మందికి స్థానచలనం

అన్నవరం నుంచి ఎక్కువమంది రాక

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భారీగా స్థానచలనాలు జరిగాయి. ఇంజనీరింగ్‌ విభాగ సూపరింటెండెంట్‌, సీనియర్‌, జూనియర్‌ అసిసెంట్లను మార్చారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని  వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న వారిని పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయానికి, ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి, అన్నవరానికి బదిలీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను దేవదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ శుక్రవారం విడుదల చేశారు. సూపరింటెండెంట్‌ స్థాయిలో పనిచేస్తున్న ముగ్గురిని అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలుకు బదిలీ చేశారు. అక్కడి నుంచి నలుగురు సూపరింటెండెంట్లను దుర్గగుడికి తీసుకొచ్చారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం నుంచి ముగ్గురు, ద్వారకా తిరుమల ఆలయం నుంచి ముగ్గురు, అన్నవరం నుంచి 11 మంది జూనియర్‌ అసిస్టెంట్లు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న 20 మంది జూనియర్‌ అసిస్టెంట్లను అన్నవరం, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమలకు బదిలీ చేశారు. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి అన్నవరం దేవస్థానంలో డీఈ (ఎలక్ర్టికల్‌)గా ఉన్న వి.సత్యనారాయణను దుర్గగుడికి తీసుకొచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కోటేశ్వరరావును ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి బదిలీ చేశారు. అన్నవరం ఆలయ ఏఈ ఈవీఎస్‌ శ్రీనివాస్‌, ద్వారకా తిరుమలలో పనిచేస్తున్న పీజీకే రాజును ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, పి.లక్ష్మణ్‌ను అన్నవరం పంపారు.

Updated Date - 2022-07-02T06:11:19+05:30 IST