మచిలీపట్నం టౌన్, మార్చి 27 : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 67 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 12 కేటగిరీల్లో 67 మంది ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎనిమిది మంది రిక్వెస్ట్ బదిలీలు కోరుకున్నారు. వీరందరికీ ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో డాక్టర్ సుహాసిని బదిలీ ఉత్తర్వులు అందజేశారు. 30వ తేదీలోగా బదిలీ అయిన స్థానాల్లో విధిగా చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.