విద్యుత్‌శాఖలో బదిలీలు

ABN , First Publish Date - 2022-06-25T05:23:08+05:30 IST

జిల్లా లోని మూడు డివిజన్లలో ఎన్‌పీడీసీఎల్‌ ఉద్యోగుల బ దిలీలు ప్ర శాంతంగా ముగిశాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఏఎల్‌ఎం, లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్లకు డీఈలు బదిలీలు నిర్వహించారు.

విద్యుత్‌శాఖలో బదిలీలు

సుభాష్‌ నగర్‌, జూన్‌ 24 : జిల్లా లోని మూడు డివిజన్లలో ఎన్‌పీడీసీఎల్‌ ఉద్యోగుల బ దిలీలు ప్ర శాంతంగా ముగిశాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఏఎల్‌ఎం, లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్లకు డీఈలు బదిలీలు నిర్వహించారు. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో మాత్రం కౌన్సెలింగ్‌, గౌడ్‌లైన్స్‌ ప్రకారం నిర్వహించలేదని, ఇష్టారీతిన డీఈ బదిలీలు చేశారని నిరసిస్తూ అధికార పార్టీ యూనియన్‌ (టీఆర్‌వీకేఎస్‌) నాయకులు శుక్రవారం ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ రవీందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. డీఈ ఏకపక్ష కౌన్సెలింగ్‌ విధానాన్ని ర ద్దుచేయాలని ఉద్యోగులకు న్యాయం చేస్తూ పారదర్శకంగా బదిలీలు చేయా లని ఎస్‌ఈని కోరారు. ఆర్మూర్‌ డీఈ కౌన్సెలింగ్‌ పేరిట ఉద్యోగులను డివి జన్‌కు పిలిపించి ఖాళీలు లేవు, ఫిట్‌గా లేవు అని బెదిరిస్తూ భయబ్రాం తులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ బదిలీ విషయంలో మొదటగా యాదగిరిని పిలిచి ఆప్షన్‌ ఎక్కడ పెట్టుకున్నావని అడిగాడన్నారు. పెర్కిట్‌ ఖాళీ ఉందని అడిగితే పెర్కిట్‌ ఖాళీ లేదని, ఆర్మూర్‌ టౌన్‌కూడా ఖా ళీ లేదని అన్నాడని తెలిపారు. అజయ్‌ కుమార్‌ అనే ఉద్యోగికి శరీరభాగం కాలిపోయి, వెన్నుముఖ దెబ్బతిని పనిచేయని పరిస్థితుల్లో ఉన్న అతను సబ్‌స్టేషన్‌ అడిగితే అతనితో వ్యంగ్యంగా మాట్లాడాడని తెలిపారు. డీఈపై చ ర్యలు తీసుకోవాలని యూనియన్‌ నాయకులు కోరారు. నిజామాబాద్‌ డివి జన్‌ పరిధిలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ప్రశాంతంగా బదిలీల  ప్ర క్రియ ముగిసింది. 

నేడు ఎస్‌ఈ పరిధిలో బదిలీలు..

ఎస్‌ఈ పరిధిలో బదిలీలను శనివారం నిర్వహించనున్నారు. జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సబ్‌ ఇంజనీర్‌, ఫోర్‌మెన్‌, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీలను శనివారం ఎస్‌ఈ రవీందర్‌ నిర్వహించనున్నారు. బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తానని ఎస్‌ఈ తెలిపారు.

Updated Date - 2022-06-25T05:23:08+05:30 IST