అప్పుడే బదిలీలా?

ABN , First Publish Date - 2021-05-07T06:36:53+05:30 IST

నగరపాలక సంస్థ పరిధిలోని 24వ సచివాలయం. ఇది నగర నడిబొడ్డు ప్రాంతమైన టవర్‌క్లాక్‌ సర్కిల్లో పారిశుధ్య పనులు పర్యవేక్షించే శానిటరీ సెక్రటరీ ఉండాలి. నాలుగు నెలల కిందట ఇక్కడి నుంచి ముత్యాలప్ప అనే ఉద్యోగిని మ్యూచువల్‌ ట్రాన్సఫర్‌ కింద కళ్యాణదుర్గం పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఓ యువతిని ఆ సచివా లయానికి కాకుండా 29వ దానికి కేటాయించారు. నేటికీ అక్కడ ఆ పోస్టు ఖాళీగానే ఉంది. పారిశుధ్య పనులు మేస్ర్తీనే పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ఇందులో ఓ ఉన్నతాధికారి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.

అప్పుడే బదిలీలా?

అధికారపార్టీ ఒత్తిళ్లా...? అధికారుల కోసమా...?

ఇష్టారాజ్యంగా సచివాలయాల్లో బదిలీలు

అనంతపురం నుంచి ఇతర ప్రాంతాలకు

తాజాగా ముగ్గురు అడ్మినలు

గతంలోనూ 20 మందికిపైగా బదిలీ

సిద్ధంగా మరో 10 మంది జాబితా ?


అనంతపురం కార్పొరేషన, మే 6: నగరపాలక సంస్థ పరిధిలోని 24వ సచివాలయం. ఇది నగర నడిబొడ్డు ప్రాంతమైన టవర్‌క్లాక్‌ సర్కిల్లో పారిశుధ్య పనులు పర్యవేక్షించే శానిటరీ సెక్రటరీ ఉండాలి. నాలుగు నెలల కిందట ఇక్కడి నుంచి ముత్యాలప్ప అనే ఉద్యోగిని మ్యూచువల్‌ ట్రాన్సఫర్‌ కింద కళ్యాణదుర్గం పంపారు. అక్కడి నుంచి వచ్చిన ఓ యువతిని ఆ సచివా లయానికి కాకుండా 29వ దానికి కేటాయించారు. నేటికీ అక్కడ ఆ పోస్టు ఖాళీగానే ఉంది. పారిశుధ్య పనులు మేస్ర్తీనే  పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ఇందులో ఓ ఉన్నతాధికారి కీలకపాత్ర  పోషించినట్లు సమాచారం. 


     నగరంలోని పారిశుధ్య విభాగంలోని ఒకటో  సర్కిల్‌ పరిధిలోని ఓ సచివాలయం నుంచి మహిళా శానిటరీ సెక్రటరీని తిరుపతికి మూడున్నర నెలల కిందట బదిలీ చేశారు. ఆ స్థానంలో మూడో సర్కిల్‌ పరిధిలోని  ఓ  సచివాలయం నుంచి మరో  సె క్రటరీని నియమించారు. కానీ మూడో సర్కిల్‌లోని సచివాలయంలో శానిటరీ సెక్రటరీ పోస్టు ఖాళీగానే ఉంది. ఆ సర్కిల్‌ పరిధిలో నా లుగు సచివాలయాలకు శానిటరీ సెక్రటరీలే లేరట. అక్కడ మేస్ర్తీలే చూసుకోవాల్సి వస్తోందట. 


సచివాలయాల్లో బదిలీలు జరిగిపోతున్నాయి. ఇవేవో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడైతే ఫర్వాలేదు. కా నీ అధికారులకు ఇష్టం వచ్చినప్పుడు, అధికారపార్టీ నేతలు చెప్పిన సందర్భాల్లో జరగడంతోనే వివాదాలకు దారి తీస్తోంది. సచివాలయ వ్యవస్థ 2019 అక్ట్టోబరు 2న ఏర్పడింది.  ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీకి రెండేళ్లు పూర్తవుతుంది. అంటే ఇంకా రెండేళ్ల ప్రొహిబిషన పీరియడ్‌ కూడా పూర్తి కాలేదు. కానీ బదిలీలు మాత్రం ఇష్టారాజ్యంగా మా రాయి. మ్యూచువల్‌ ట్రాన్సఫర్‌ల కింద కొందరిని జిల్లాలోని మరో మున్సిపాలిటీకి కూడా బదిలీ చేశారు. జిల్లా సరిపోదనుకున్నారో ఏమో మరి...ఏకంగా రాయలసీమ పరిధిలో తిరుపతి కార్పొరేషనకు కూడా బదిలీ చేసేశారు. అయితే ఈ బదిలీలను చూసిన కొందరు ఉద్యోగులు తమకు ఆసక్తి కలిగిన ప్రాంతాలకు, ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల నుంచి కొత్త సచివాలయాలకు బదిలీలకు విన్నవించుకున్నారు. కానీ అలాంటివి కనీసం అధికారులకు వినిపించను కూడా  లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు 20 మందికిపైగా సచివాలయాల్లో ఉద్యోగులను బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా మరో ముగ్గురు అడ్మినలను బదిలీ చేశారు. ఇంకా కొందరి జాబితా కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవి రాజకీ య ఒతిళ్లతో జరుగుతున్నాయా...? లేక అధికారుల  ఇష్టారాజ్యంతో జరుగుతున్నాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ఎన్నికలకు ముందే బదిలీలు....

సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తయిందో లేదో...అప్పుడే బదిలీలపై దృష్టి పెట్టారు. మున్సిపల్‌ ఎన్నికలు జరగకముందే ఈ బదిలీల వ్యవహారం జరిగింది. అప్పట్లో దాదాపు 35 నుంచి 40 మంది వరకు బదిలీలు చేయాలని విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఇందులో ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. శానిటరీ సెక్రటరీలు, టౌనప్లానింగ్‌ విభాగం పరిధిలో సెక్రటరీలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. వారితో పాటు సచివాలయాల అడ్మినలు, ఇతర సెక్రటరీలకు సంబంధించి బదిలీలపై కథ నడిపారు. అనంతపురం నగరపాలక సంస్థలోనే కాకుండా ఇతర ము న్సిపాలిటీలు, ఇతర జిల్లాల కార్పొరేషనలకు కూడా బదిలీలు జరగడమే ఇందుకు నిదర్శనం. అప్పట్లో ఎన్నికలు రావడంతో 20 వరకు బదిలీలకు బ్రేక్‌ పడినట్లు తెలిసింది. అప్పట్లో అధికారపార్టీకి చెందిన వైసీ పీ నేతలు చెప్పినవి కొన్నయితే,  అధికారులు ఇష్టపూర్వకంగా చేసినవి మరికొన్ని ఉన్నట్లు సమాచారం. అందరూ కొత్తవారే కావడంతో గుట్టుచప్పుడు కాకుండా  చాప కింద నీరులా ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందట నగరంలోని మూడు సచివాలయాల్లో ఏకంగా వార్డు అడ్మినలనే బదిలీ చేశారు. ఐదో సచివాలయం అడ్మిన సి.ప్రసాద్‌ను 33వ సచివాలయానికి, 33వ సచివాలయం అడ్మిన ఎంఎ్‌స.శిల్పను 37వ సచివాలయానికి, 37వ సచివాలయం అడ్మిన పి.ప్రభావతిని ఐదో సచివాలయానికి బదిలీ చేశారు. ఇక్కడ కూడా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు బాగానే పనిచేసినట్లు సమాచారం. 


మరో పది మంది జాబితా...?

అడిగేవారు లేరనుకున్నారో... చేసినా పట్టించుకోరులే అని భావించారో తెలియదు కానీ సచివాలయాల్లో మరిన్ని బదిలీలకు సిద్ధమవుతున్నట్లు  సమాచారం. ఆ మేరకు మరో 10 మంది ఉద్యోగుల జాబితాను రెడీ చేస్తున్నట్లు తెలిసింది. సచివాలయాల్లో  బదిలీలు చేయటానికి కొంద రు నేతలు, కార్పొరేటర్లు సైతం ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు ఆయా సచివాలయ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది. తమ అభీష్టం లేకుండా అటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా ఎలా బదిలీలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అధిక శాతం సచివాలయాల్లో కీలకమైన విభాగాలకు సంబంధించి వార్డు సచివాలయ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పారిశుధ్యంలోనే ఏడు సెక్రటరీ పోస్టులు భర్తీ చేయలేదు.  ఈ నేపథ్యంలో  బదిలీలు ఇలాగే కొ నసాగితే క్షేత్రస్థాయిలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 


ఇంటర్నల్‌గానే చేశాం : రమణారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌, కార్పొరేషన

తాజాగా ఒకటి, రెండు సచివాలయాల్లో బదిలీలు అడ్మినిస్ర్టేటివ్‌ కారణాలతో జరిగాయి. నెంబర్లు ఐడియా లేవు. ప్రత్యేకంగా ఏమీ లేదు. అంతర్గతంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే బదిలీలు చేశాం. 



Updated Date - 2021-05-07T06:36:53+05:30 IST