ఉమ్మడి జిల్లాల ఎస్సైల బదిలీలు

ABN , First Publish Date - 2021-01-16T06:10:52+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఎట్టకేలకు ఎస్‌ఐల బదిలీ లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న 17మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ శుక్రవారం ఐ.జి. శివ శంకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఉమ్మడి జిల్లాల ఎస్సైల బదిలీలు

ఖిల్లా, జనవరి 15: ఉమ్మడి జిల్లాలో ఎట్టకేలకు ఎస్‌ఐల బదిలీ లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో  పని చేస్తున్న  17మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ శుక్రవారం ఐ.జి. శివ శంకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని 2వ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న పి. ప్రభాకర్‌ను భీంగల్‌ పోలీసు స్టేషన్‌కు, వీఆర్‌లో ఉన్న డి.సాయినాథ్‌కు నిజామాబాద్‌ 2వ పోలీసు స్టేషన్‌కు, భీంగల్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న కే.శ్రీధర్‌రెడ్డిను ఎస్‌హెచ్‌వో మెండోరాకు, మెండోర పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న పి. సురేష్‌ను ఎస్‌హెచ్‌వో మోర్తాడ్‌కు, మోర్తాడ్‌లో పని చేస్తున్న ఎం.సంపత్‌కుమార్‌ ను వీఆర్‌ సిద్దిపేట్‌ పోలీసు కమీషనరేట్‌కు, వేల్పూర్‌ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న పి. శ్రీధర్‌గౌడ్‌ను ఎస్‌హెచ్‌వో కమ్మర్‌పల్లికు, కమ్మర్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న ఎండి.ఆసీఫ్‌ను ఎస్‌హెచ్‌వో ఎర్గట్ల పోలీసు స్టేషన్‌కు, ఎర్గట్ల పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో పని చేస్తున్న బి.హరిప్రసాద్‌ను ఎస్‌హెచ్‌వో ముప్కాల్‌ పోలీసు స్టేషన్‌కు, ముప్కాల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న జి.రాజ్‌భరత్‌ను ఎస్‌హెచ్‌వో వేల్పూర్‌ పోలీసు స్టేషన్‌కు కామారెడ్డి జిల్లా మద్నూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న పి. రాఘవేందర్‌ను ఎస్‌హెచ్‌వో బాల్కొండ పోలీసు స్టేషన్‌కు, బాల్కొండ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న టి. శ్రీహరిను వీఆర్‌ నిజామాబాద్‌కు, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తు న్న కే.సందీప్‌ను నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు, నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న ఎం. లక్ష్మయ్యను వీఆర్‌ నిజామాబాద్‌కు, మెదక్‌ జిల్లాలో వీఆర్‌లో ఉన్న బి.సంతోష్‌కుమార్‌ను సంగారెడ్డి జిల్లాలోని కొండపూర్‌ పోలీసు స్టేషన్‌కు, సంగారెడ్డి జిల్లా కొండపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేస్తున్న కే.రాజును వీఆర్‌ సంగారెడ్డికు, వీఆర్‌ కామారెడ్డిలో ఉన్న అహ్మద్‌మోహిద్దీన్‌ను 2వ ఎస్‌ఐ భిక్కనూర్‌కు కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న కే.రాజును మద్నూర్‌ ఎస్‌ హెచ్‌వోగా బదిలీ చేశారు. మరి కొందరికి బదిలీలు-పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎస్‌ఐల బదిలీలను పోలీసు శాఖ సంక్రాంతి కానుకగా కొం  దరిని బదిలీ చేశారు. మరి కొందరిని సైతం బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధం గా 2 ఏళ్లకు పైగా ఒకే పోలీసు స్టేషన్‌ పరిధిలో సీఐలుగా పని చేస్తున్న వారిని బదిలీ చేయడానికి పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది. పోలీసు శాఖలో గత కొంత కాలంగా బదిలీలు చేయక పోవడంతో ఒకే చోట 2 ఏళ్లకు పైగా కాలంగా పని చేస్తున్న ఎస్‌ఐలు బదిలీల కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు పోలీసు శాఖ దీర్ఘకాలంగా ఒకే పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐలను బదిలీలు చేశారు.
రాజకీయ ప్రమేయంతో బదిలీలు
పోలీసు శాఖలో రాజకీయ ప్రమేయంతో ఎస్‌ఐల బదిలీలు జరిగినట్లు ఆ శాఖలో  చర్చించుకుంటున్నారు. పోలీసు శాఖలో పని చేస్తున్న వారు కొందరు పలు విషయాల్లో ఆరోపణలు సైతం ఎదు ర్కొంటున్నారు. అటువంటి వారు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారు కోరుకున్న పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయించుకున్నట్లు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్‌లో పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఎస్‌ఐకు నిజామాబాద్‌ జిల్లాలోని మరో మంచి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయడంతో ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆ ఎస్‌ఐకు వీఆర్‌ ఖాయమనుకున్నారు. కానీ ఆయన రాజకీయ పలుకుబడితో మంచి పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-01-16T06:10:52+05:30 IST