విద్యా శాఖలో బదిలీలు

ABN , First Publish Date - 2022-07-02T06:36:44+05:30 IST

ఉమ్మడి జిల్లా విద్యా శాఖలో పనిచేస్తోన్న బోధనేతర సిబ్బంది సాదారణ బది లీల కౌన్సెలింగ్‌ను నిర్వహించినట్టు డీఈవో ఆర్‌.ఎస్‌. గం గాభవాని తెలిపారు.

విద్యా శాఖలో బదిలీలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 1 : ఉమ్మడి జిల్లా విద్యా శాఖలో పనిచేస్తోన్న బోధనేతర సిబ్బంది సాదారణ బది లీల కౌన్సెలింగ్‌ను నిర్వహించినట్టు డీఈవో ఆర్‌.ఎస్‌. గం గాభవాని తెలిపారు. సీనియర్‌ అసిస్టెంట్లు ఐదుగురు, జూనియర్‌ అసిస్టెంట్లు తొమ్మిది మంది, రికార్డు అసిస్టెం ట్లు 11 మంది, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఒకరు, స్వీపర్లు ఇద్దరు, నైట్‌ వాచ్‌మెన్‌ ఒకరు బదిలీ అయ్యారని వివరించారు.


కోర్టుకెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయులు  

ఉపాధ్యాయులను వారి సొంత మేనేజ్‌మెంట్‌ పాఠశా లలకు పంపాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై మూడు వారాల్లోగా అఫిడవిట్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు మద్దూరి సూర్యనారాయణమూర్తి తెలిపా రు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను కొట్టివేస్తూ గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని వివరించారు.


Updated Date - 2022-07-02T06:36:44+05:30 IST