సిఫార్సులు.. ఒత్తిళ్లు

ABN , First Publish Date - 2022-07-01T06:12:02+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉద్యోగుల బదిలీల్లో దాదాపు అన్ని శాఖల్లోనూ ఉద్యోగ బదిలీ ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఐదేళ్లు పూర్తయిన వారే కాకుండా పాలనా సౌలభ్యం పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల సిఫార్సులు, ఒత్తిళ్ళు పనిచేశాయి.

సిఫార్సులు.. ఒత్తిళ్లు

బదిలీ ప్రక్రియ పరిసమాప్తం

 మూడు వేల మందికి పైగా ఉద్యోగుల బదిలీ

 కోరుకున్న చోటే పోస్టింగ్‌లు.. ఎమ్మెల్యేల సహకారం

 కీలక స్థానాల కోసం పోటాపోటీ.. పశ్చిమ వైపే ఎక్కువ మొగ్గు


ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉద్యోగుల బదిలీల్లో దాదాపు అన్ని శాఖల్లోనూ ఉద్యోగ బదిలీ ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఐదేళ్లు పూర్తయిన వారే కాకుండా పాలనా సౌలభ్యం పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల సిఫార్సులు, ఒత్తిళ్ళు పనిచేశాయి. దాదాపు మూడు వేల మందికిపైగా ఉద్యోగులు, అధికారులు బదిలీ ప్రక్రియకు సంబంధించి కౌన్సెలింగ్‌ పూర్తయ్యింది.    కొన్ని శాఖలకు సంబంధించి రాత్రి పొద్దుపోయే ముందు ఉత్తర్వులు వెలువడ్డాయి.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఉమ్మడి పశ్చిమలో వివిధ శాఖలకు చెందిన సుమారు మూడు వేల మందికి పైగా బదిలీ అయ్యా రు. కీలకమైన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పంచాయతీరాజ్‌, వాణిజ్య పన్నులు, ట్రెజరీ, సోషల్‌ వెల్ఫేర్‌, జడ్పీ, ఆర్‌అండ్‌బీ, దేవదాయ, పౌర సరఫరాలు, ఐసీడీఎస్‌ వంటి విభాగాలన్నింటిలోనూ పెద్ద ఎత్తున మంచి స్థానాల కోసం కొందరు ఉద్యోగులు పోటీ పడ్డారు. తామనుకున్నది సాధించుకునేందుకు అనుకూలురైన నేతలను సంప్రదించి సిఫార్సు లేఖలు అందుకున్నా రు. వాటిని ఉన్నతాధికారులకు సమర్పించి తమ పని చేయాలని వేడుకున్నారు. ఇప్పటికే ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగుల సంఖ్య ఒకింత తక్కువగానే ఉన్నప్పటికీ పాలనా సౌలభ్యం పేరిట ఇంకొందరు మంచి స్థానాల్లో పోస్టింగ్‌ను ఆశించారు. ఈ ప్రక్రియ కొన్నాళ్ల క్రితమే ముగియాల్సి ఉన్నా జూన్‌ నెలాఖరు వరకు పొడిగించడంతో సిఫార్సులు మరింత వెల్లువెత్తాయి. తొలుత బదిలీ వారి సంఖ్య 1,850 నుంచి 2,100లోపే ఉందని అంచనా వేసినా, ఈ సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. ఎలాగూ జిల్లాలు విడిపోయాయి కాబట్టి ఇప్పుడు కోరుకున్న చోట పోస్టింగ్‌ దక్కించుకుంటే తమకు తిరుగులేదనే భావన ఉద్యోగుల్లో కనిపించింది.


మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులు

బదిలీ ప్రక్రియ ఎప్పుడు జరిగినా కీలకంగా వ్యవహరించే మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులు ఈ సారి కూడా వెల్లువెత్తుతాయి. జిల్లాల పునర్విభజనతో ఆ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేల పై మరింత ఒత్తిడి పెరిగింది. డీఈవో దగ్గర నుంచి పరిపాలన అధికారి హోదా కలిగిన వారి వరకు బదిలీలు గురువారం పొద్దుపోయే వరకు కొనసాగుతూ వచ్చాయి. ఓ వైపు కౌన్సెలింగ్‌ ప్రక్రియతోపాటు అవకాశం వున్న ‘చోట’ల్లా బదిలీలకు ఉపయోగించుకున్నారు. మంత్రుల సిఫార్సులకు యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఒక పోస్టింగ్‌కు ఒకే ప్రదేశంలో ఒకరికి సిఫార్సు చేస్తే సరేసరి, లేదా ఇరువురికి చేస్తే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అడిగి మరీ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ‘నా నియోజకవర్గంలో ఫలానా వారికి నేను చెప్పినచోట పోస్టింగ్‌ ఇవ్వాలి. ఎమ్మెల్యే గా చెబుతున్నా. కాదూ కూడదనుకుంటే చెప్పేయండి. ఎలా సాధించుకోవాలో నాకూ తెలుసు’ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు అధికారులకు సున్ని తంగానే వార్నింగ్‌ ఇచ్చారు. తమ మాటకు విలువ లేకపోతే మిగతా ఉద్యోగుల్లో తమ పరిస్థితి మరింత బలహీనపడు తుందని గమనించి అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఉద్యోగుల బదిలీల్లో నేరుగానే తమ వైఖరిలతో హోరెత్తించారు. తమ సామాజిక వర్గానికి చెందిన, తమ పార్టీకి అనుకూలురుగా ఉన్న ఉద్యోగుల ను కోరుకున్న చోటకు బదిలీ చేసేలా అస్త్రశస్త్రాలను ప్రయోగిం చారు. ఉద్యోగ సంఘాల్లో కొందరు నేతలు ఈసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ సంఘాలకు సంబంధించి ఆఫీసు బేరర్స్‌గా ఎవరున్నారనే విషయంలో మూడు విడతలపాటు కొనసాగిన వారికి బదిలీల్లో స్పష్టమైన అర్హత కలిగి ఉండడంతో ఆ దిశగానే అడుగులు వేశారు. కొందరిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకొందరిపై సోషల్‌ మీడియాలో ఎడతెగని పోస్టింగులు పెట్టారు. కావాలనే కొందరు కొత్తగా ఆఫీసు బేరర్‌గా హోదా తగిలించి బదిలీ పక్రియలో లబ్ధి పొందేం దుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. 


భారీగా కొత్త జిల్లాకు..

నూతన పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యేందుకు ఉద్యోగుల్లో పోటీ వాతావరణం నెలకొంది. భీమవరం జిల్లా కేంద్రంగా ఎటు ప్రయాణించినా 45 కిలోమీటర్లలోపే నిడివి ఉండడం, తగ్గట్టుగా ఉద్యోగ నిర్వహణకు అనుకూ లతలు, వైద్య, విద్య రంగాల్లో సానుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల మధ్య ఇక్కడకు బదిలీ  అయ్యేందుకు పోటీ వాతావరణం నెలకొంది. ఇంజనీరింగ్‌ విభాగాలతో పాటు సంక్షేమ శాఖకు సంబంధించి అత్యధికులు బదిలీకి దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఎక్కువ మందికి సిఫారసు లేఖలు అందడం విశేషం. దేవదాయ ధర్మదాయ శాఖలోనూ భారీగా బదిలీలు జరిగాయి. మండల పరిషత్‌ అన్నింటిలోనూ బదిలీల ప్రక్రియకు సంబంధించి జిల్లా పరిషత్‌ నుంచి ఏకబిగిన డైరెక్షన్లు వెళ్లాయి


జడ్పీలో 429 మంది బదిలీ

పంచాయతీల్లో 420 మంది బదిలీ

ఏలూరు సిటీ, జూన్‌ 30 : ఉద్యోగుల బదిలీల పర్వం ముగిసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌తో   పాటు, ఏలూరు జిల్లాలోని జిల్లా పం చాయతీ కార్యాలయం, వ్యవసాయ శాఖలతోపాటు అన్ని ప్రభుత్వశాఖలలో బదిలీలు జరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ యాజమా న్యంలో పనిచేస్తున్న 429 మంది ఉద్యో గులను బదిలీ చేశారు. జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ గురువారం బదిలీ అయిన ఉద్యోగులకు ఉత్తర్వులు అంద జేశారు. జడ్పీ సీఈవో కేవీఎస్‌ఆర్‌ రవికు మార్‌, పంచాయతీ రాజ్‌ మినిస్టీరి యల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి.శ్రీధర్‌రాజు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ నాయకులు కె.గోవిందరాజు పాల్గొన్నారు. జడ్పీలో మొత్తం 943 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఇందులో ఒకేచోట  ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు 350 మంది, రిక్వెస్ట్‌ బదిలీల కోసం 164  మంది మొత్తం 514 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హతల మేరకు 429 మంది ఉద్యోగులకు బదిలీలు  నిర్వహించి, వారు కోరుకున్న   స్థానాలలో నియమించి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. గుండుగొలను జడ్పీ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈదా శ్రీనివాస్‌ అనే అంధ ఉద్యోగికి ఆయన కోరుకున్న ఏలూరు పీఆర్‌ డివిజన్‌ (పీఐయూ)లో నియ మించారు. ఆఫీసు బేరర్లుగా 53 మంది ఉద్యోగులకు బదిలీల నుంచి మినహా యింపు ఇచ్చారు.


Updated Date - 2022-07-01T06:12:02+05:30 IST