బదిలీ ఉత్తర్వులు అందజేస్తున్న ఎంఈవో గాంధీ
పాయకరావుపేట, జనవరి 16 : మండలంలోని పలువురు ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. శనివారం ఎమ్మార్సీ భవనంలో ఎంఈవో కేఎన్ గాంధీ పలువురికి బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 24 పంచాయతీల్లో ఉన్న 58 ప్రభుత్వ పాఠశాలల్లో 191 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో మండలంలోని 13 మంది ఉపాధ్యాయులు ఇతర మండలాలకు బదిలీ కాగా, ఇతర మండలాల నుంచి 17 మంది వచ్చారన్నారు. అదేవిధంగా 35 మంది ఉపాధ్యాయులు వివిధ పాఠశాలలకు బదిలీ అయ్యారని, వీరందరికీ బదిలీ ఉత్తర్వులు అందజేశామని చెప్పారు.