Advertisement

మిస్సింగ్‌ కేసులకు చెక్‌

Jan 24 2021 @ 00:34AM
పోలీసులు గుర్తించిన నల్లగొండ వాసి మణిపాల్‌రెడ్డి(ఫైల్‌)

 యాంటీ హ్యూమన్‌ ట్రాఫికరింగ్‌ టీమ్‌తో సత్ఫలితాలు
 నెల రోజుల్లో ఐదు కేసులు ఛేదించిన పోలీసులు
 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు

 నల్లగొండ క్రైం, జనవరి 23 ; నల్లగొండ పట్టణంలోని బర్కత్‌పురకు చెందిన ముస్లిం యువతి కుటుంబ పరిస్థితులతో పాటు వివిధ కారణాలతో 2015లో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆచూకీ ఎక్కడా లభించక 2017లో కేసు మూసేశారు. తాజాగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన యాంటీ హ్యూమన్‌ ట్రాఫికరింగ్‌ టీమ్‌ కేసును తిరిగి విచారించింది. హైదరాబాద్‌లోని రెతీఫైల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆమె ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చి ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఆమె వారి కుటుంబసభ్యుల వద్దకు వచ్చేందుకు అంగీకరించకపోవడంతో పోలీసులు పూర్తి ఆధారాలు తీసుకుని భర్త వద్దే వదిలేసి కుటుంబసభ్యులకు వివరాలు అందించారు.
హాలియాకు చెందిన మణిపాల్‌రెడ్డి అనే విద్యార్థి పాఠశాల స్థాయిలో తండ్రి మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం వారు కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని వన్‌టౌన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు. మణిపాల్‌రెడ్డి తప్పిపోయిన సమయంలో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఆచూకీ తెలవకపోవడంతో వారు ఆశ వదులుకున్నారు.  యాంటీ హ్యూమన్‌ ట్రాఫికరింగ్‌ టీమ్‌ ప్రత్యేక చొరవతో  బాలుడికి సంబంధించిన వివరాలను తీసుకుని ఆయన ఆచూకీ తెలుసుకుని వారి కుటుంబసభ్యులకు అందించి ప్రశంసలు అందుకున్నారు.
జిల్లాకేంద్రంలోని ఎన్‌జీఓ్‌స కాలనీకి చెందిన కొండ విజయచందర్‌ వివాహం చేసుకోగా వారికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే కుటుంబకలహాలతో భార్య చౌటుప్పల్‌, రామన్నపేటతో పాటు వివిధ పీఎ్‌సల్లో భర్తపై పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈ ఇబ్బందులను తట్టుకోలేక విజయచందర్‌ 2017లో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయి తే విజయచందర్‌ తల్లి స్థానిక టూటౌన్‌ పీఎ్‌సలో ఫిర్యాదు చేయగా ఆయన ఆచూకీ  లభించకపోవడంతో ఇక లేడని ఆశ వదులుకున్నారు. అయితే ఈ టీమ్‌ ఆయన ఆధార్‌ వివరాలను సేకరించి కామారెడ్డిలో ఓ కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్నట్లు గుర్తించి ఈ నెల 12న జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి వారి కటుంబసభ్యులకు అప్పగించారు.

ఇలా మిస్సింగ్‌ కేసుల చేధనలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికరింగ్‌ టీ మ్‌ సత్ఫలితాలు సాధిస్తోంది. ఇక తమ వారు లేరు అని బాధపడుతున్న కుటుంబసభ్యులకు మిస్సైన వారి వివరాలు తెలిపి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. యాంటీ టీమ్‌ ప్రతిభను పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం పోలీస్‌ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా పోలీసులు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ఏళ్ల తరబడి పెండి ంగ్‌లో ఉన్న మిస్సింగ్‌ కేసులు ఛేదించేందుకు ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ యాం టీ హ్యూమన్‌ ట్రాఫికరింగ్‌ టీమ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ టీమ్‌ మిస్సింగ్‌ కేసులను రీఓపెన్‌ చేసి వాటిని పరిష్కరించే పనిలో నిమగ్నమైంది. నెల రోజుల వ్యవధిలోనే ఐదు కేసులు ఛేదించారు. మిస్సింగ్‌ కేసులు చేధిస్తున్న తీరును పలువురు హర్షిస్తున్నారు.
జిల్లాలో 78 మిస్సింగ్‌ కేసులు నమోదు
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 78 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. వివిధ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో ఏళ్ల తరబడి మిస్సింగ్‌ కేసులకు సంబంధించి వారి ఆచూకీ లభించక  కేసులు మూసివేసిన సందర్భాలు  అనేకం ఉన్నాయి. అయితే హ్యూమన్‌ ట్రాఫికరింగ్‌ టీమ్‌ ఏర్పాటుతో మూసేసిన  కేసులను సైతం రీఓపెన్‌చేసి పరిష్కరించే పనిలో ఉన్నారు. అయితే జిల్లాలోని నల్లగొండ సబ్‌ డివిజన్‌లో 35కేసులు, మిర్యాలగూడ డివిజన్‌లో 34కేసులు, దేవరకొండ డివిజన్‌లో 9మిస్సింగ్‌ కేసులు ఉన్నాయి. అందులో ఇప్పటికే ఐదు కేసులు ఛేదించగా 73కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు..
ప్రస్తుత సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో పోలీస్‌ శాఖ ముందుంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆధునిక టెక్నాలిజీతో ఎన్నో కేసులు ఛేదించి వివిధ క్రిటికల్‌ కేసులను సైతం ఇట్టే పరిష్కరించారు. ప్రస్తుతం మిస్సింగ్‌ కేసుల చేధనకు ఏర్పాటు చేసిన టీమ్‌ ఆధునిక టెక్నాలిజీని వినియోగిస్తున్నారు. ఆధార్‌ కార్డును సే కరించి తమదైన శైలిలో వివరాలు సేకరిస్తున్నారు. ఆఽధార్‌ నెంబర్‌ ద్వారా బ్యాంకు అకౌంట్‌, వాహనాల రిజిస్ర్టేషన్లు పాన్‌కార్డుతో ఆధార్‌ లింకయ్యే అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఫోన్‌ ద్వారా సైతం వివిధ కోణాల్లో విచారించి సీడీఆర్‌ అనాలసి్‌సతో కేసులను పరిష్కరిస్తున్నారు. ఈ కేసుల్లో ముఖ్యంగా దర్పన్‌ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిస్సింగ్‌ కేసుల సమయంలో పోలీ్‌సస్టేషన్లలో ఇచ్చిన ఫోటోలను తాజా ఫోటోలను టాలీ చేసి చూసిన సందర్భంగా దర్పన్‌ యాప్‌ ఇట్టే పసిగట్టేస్తుంది.
మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక టీమ్‌
జిల్లాలో మిస్సింగ్‌ కేసుల పరిష్కారానికి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నాం. మిస్సింగ్‌ కేసులను ఛేధనకు యాంటీ హ్యూమన్‌ ట్రాఫికరింగ్‌ టీమ్‌ ఏర్పాటు చేసి సీఐతో పాటు ఎస్‌ఐలు, సిబ్బందిని కేటాయించాం. ఆ టీమ్‌ జిల్లాలో మిస్సింగ్‌ కేసులను తీసుకుని పరిష్కరించే పనిలో ఉంటుంది. నెల రోజుల వ్యవధిలోనే మూడు కేసులను ఛేదించి వారి కటుంబాలకు అప్పగించాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మరిన్ని కేసులు ఛేదించేలా కృషి చేస్తాం.
- ఏవీ.రంగనాధ్‌, ఎస్పీ, నల్లగొండ

Follow Us on:
Advertisement