ఇరుక్కపోయిన లారీ

ABN , First Publish Date - 2021-12-04T05:35:25+05:30 IST

మండలంలోని కొండాపురం గ్రామం వద్ద పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ నుంచి చెన్నైకి వెళ్లే లారీ శుక్రవారం ఇరుక్కుపోయింది.

ఇరుక్కపోయిన లారీ

  1. స్తంభించిన ట్రాఫిక్‌


ఆళ్లగడ్డ, డిసెంబరు 3: మండలంలోని కొండాపురం గ్రామం వద్ద పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ నుంచి చెన్నైకి వెళ్లే లారీ శుక్రవారం ఇరుక్కుపోయింది. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. కొండాపురం వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దపెద్ద గోతులు పడ్డాయి. వీటిని పూడ్చే వారే లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. లారీ ఇరుక్కుపోవడంతో ఆళ్లగడ్డ- కోవెలకుంట్ల రహదారిలో బస్సులు తిరగలేదు. సాయంత్రం పాఠశాలలు వదలటంతో విద్యార్థులు పి.చింతకుంట, కొండాపురం గ్రామాలకు సుమారు రెండు కిమీ నడిచి వెళ్లారు. 

Updated Date - 2021-12-04T05:35:25+05:30 IST