బెంగళూరులో Car ఓనర్లకు ట్రావెల్ కంపెనీ షాక్

ABN , First Publish Date - 2021-12-02T00:17:04+05:30 IST

బెంగళూరులో Car ఓనర్లకు ట్రావెల్ కంపెనీ షాక్

బెంగళూరులో Car ఓనర్లకు ట్రావెల్ కంపెనీ షాక్

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కార్ల యజమానులకు ఓ ట్రావెల్ కంపెనీ షాక్ ఇచ్చింది. ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు వేర్వేరు వ్యక్తుల నుంచి 150 కార్లను లీజుకు తీసుకుని అద్దె చెల్లించకుండా పరారయ్యారు. నెలవారీ అద్దె చెల్లించడంలో ఆలస్యం చేశారని లగ్గెరేకు చెందిన క్యాబ్ డ్రైవర్ యషాస్ ఆ ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బగలగుంటె వద్ద ఎంఈఐ లేఅవుట్లో ఆర్‌ఎస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ నడుపుతున్న శివకుమార్‌, అతని సహచరులు శ్రీకాంత్‌, కృష్ణగౌడ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.


నవంబర్ 8న చెల్లించాల్సిన అక్టోబర్ అద్దె రాకపోవడంతో బాధితుడు యశాస్ ముగ్గురిని సంప్రదించడానికి ప్రయత్నించాడని, కానీ వారి ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని పోలీసులు తెలిపారు. అనంతరం వారి కార్యాలయానికి వెళ్లిన అతను ఇదే తరహాలో పలువురు కార్ల యజమానులను మోసం చేసి పరారీలో ఉన్నారని తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. దాదాపు 150 మంది కార్ల యజమానులు ఫిర్యాదులు చేశారని, రూ. 10 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-02T00:17:04+05:30 IST