ఎక్వాయిపల్లి రోడ్డుపై ప్రయాణం గగనం!

ABN , First Publish Date - 2021-07-23T05:15:03+05:30 IST

ఎక్వాయిపల్లి రోడ్డుపై ప్రయాణం గగనం!

ఎక్వాయిపల్లి రోడ్డుపై ప్రయాణం గగనం!
బీటీ కొట్టుకపోయి గుంతలమయమైన ఎక్వాయిపల్లి రోడ్డు

  • పాడైన కర్కల్‌పహాడ్‌-ఎక్వాయిపల్లి రోడ్డు

కడ్తాల్‌: మండల పరిధిలోని శ్రీశైలం-హైదరాబా ద్‌ జాతీయ రహదారి నుంచి ఎక్వాయిపల్లి , ము ద్విన్‌ మీదుగా చరికొండ వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా పాడై రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల క్రితం ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన  కింద నిర్మించిన బీటీ రోడ్డు నిర్వాహణ లే క గోతులేర్పడ్డాయి. అడుగడుగునా బీటీ కొట్టుకుపోయి, కంకర తేలి మోకాళ్లలోతు గోతులేర్పడ్డాయి. పాడైన ఈ రోడ్డు మూలంగా ప్రయాణికులు, వాహనధారులు నరకయాతన పడుతున్నారు. అంతంత మాత్రంగా ఉన్న రోడ్డు ఇటీవలి వర్షాలకు మరింత దెబ్బతింది. పాడైన రోడ్డు మూలంగా వాహనధారులు తరుచూ ప్రమాదాలబారిన పడుతున్నారు. ఆమనగల్లు, మాడ్గుల మండలాల పలు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు నుంచి నిత్యం రాకపోకలకు సాగిస్తుంటారు. కర్కల్‌పహాడ్‌-ఎక్వాయిపల్లి మధ్యలో మైసమ్మగుడి సమీపంలో బీటీ రోడ్డు కొట్టుకుపోయింది. పాడైన రోడ్డుకు మరమ్మతు చేసి ఇబ్బందులు తీర్చాలని ఆయాగ్రామాల ప్రజలు ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కర్కల్‌పహాడ్‌ నుంచి ఎక్వాయిపల్లి, ముద్విన్‌ మీదుగా చరికొండ వరకు బీటీ రోడ్డును మరమ్మతు చేసి డబుల్‌ రోడ్డుగా మార్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కలిపే ఈ రోడ్డు డబుల్‌ రోడ్డుగా విస్తరిస్తే 20 గ్రామాల ప్రజలకు మైరుగైన రోడ్డు సౌకర్యం కలుగుతుంది. రెండు జిల్లాల మధ్య రవాణ మెరుగుపడుతుంది. ఇంత కీలకమైన ఎక్వాయిపల్లి రోడ్డుపై ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టి ఆధునికీకరించాలని ప్రజలు కోరుతున్నారు.


  • డబుల్‌ రోడ్డుగా విస్తరించాలి


కర్కల్‌పహాడ్‌-ఎక్వాయిపల్లి మీదు గా చరికొండ వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా పాడైంది. రోడ్డు మరమ్మతు విషయంలో ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. 10 కిలోమీటర్ల ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించాలి. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రోడ్డుపై గోతులేర్పడి ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలూ చోటుచేసుకుంటున్నాయి.


- జంగం సుగుణసాయిలు, సర్పంచ్‌, ఎక్వాయిపల్లి

Updated Date - 2021-07-23T05:15:03+05:30 IST